|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షోకింగ్: బేబమ్మ అందాల విధ్వంసం! యంగ్ హీరోయిన్ హాట్ ట్రీట్ వైరల్!

Published: 01-02-2026, 12:35 AM
షోకింగ్: బేబమ్మ అందాల విధ్వంసం! యంగ్ హీరోయిన్ హాట్ ట్రీట్ వైరల్!
  • కృతి శెట్టి లేటెస్ట్ పిక్స్ వైరల్: లెహంగాలో అందాల విందు!
  • సోషల్ మీడియాలో కృతి శెట్టి హాట్ షోతో కుర్రకారు ఫిదా!
  • ‘వా వాతియార్’ మూవీతో కృతి రీసెంట్ ఎంట్రీ.. పాజిటివ్ టాక్!
  • ప్రదీప్ రంగనాథ్ మూవీలో కృతి.. మెగాస్టార్ సినిమాలోనూ ఛాన్స్!

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవ్వడంతో, అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.

లెహంగాలో కృతి శెట్టి మెరుపులు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే బేబమ్మగా తెలుగు ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. దీంతో ఈ క్యూట్ హీరోయిన్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఉప్పెన లాంటి హిట్ అయితే రాలేదు. దీంతో కొన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ప్రజెంట్ ప్రదీప్ రంగనాథ్(Pradeep Ranganath) హీరోగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) మూవీతో పాటు చిరంజీవి బాబి కొల్లి కాంబోలో వస్తున్న సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది.

అయితే ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా స్టార్ హీరో కార్తి(Karthi) నటించిన ‘వా వాతియార్’ మూవీతో మన ముందుకు వచ్చింది. నలన్ కుమార స్వామి(Nalan Kumarasamy) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మించారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం స్టైలిష్ వేర్ డ్రెస్సులతో కుర్రకారును ఫిదా చేస్తూ ఉంటుంది.

‘వా వాతియార్’తో రీసెంట్ ఎంట్రీ ఇచ్చిన బేబమ్మ

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కృతి శెట్టి తన ఇన్‌స్టా(Instagram) అకౌంట్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో లెహంగాలో యద అందాలు కనిపించేలా హాట్ షో చేసింది. నడుమందాలతో మత్తెక్కిచ్చింది. వావ్ అనిపించే అందంతో యూత్‌ను ఆకట్టుకుంటుంది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు మేడమ్ సార్ మేడమ్ అంతే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రదీప్, చిరు సినిమాలతో బిజీగా కృతి శెట్టి

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

కృతి శెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.