|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kubera Collection: హిట్ టాక్‌తో ‘కుబేర’.. వసూళ్లు ఎంతొచ్చాయ్?

Published: 21-06-2025, 1:50 AM
Kubera Collection: హిట్ టాక్‌తో 'కుబేర'.. వసూళ్లు ఎంతొచ్చాయ్?

వేసవి సీజన్‌లో స్టార్ హీరోల సినిమాలు లేక డల్‌గా ఉన్న బాక్సాఫీస్‌కు కుబేర సినిమా కొత్త జోష్‌ని తెచ్చింది. రిలీజ్ ముందు హైప్ లేకున్నా, పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు.

Key Points

1

కుబేర సినిమాకు మంచి టాక్ వస్తుంది.

2

తెలుగు, తమిళ రాష్ట్రాల్లో తొలిరోజు రూ.13 కోట్ల వసూళ్లు.

4

ఆకర్షణీయమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించిన కుబేర.

కుబేర సినిమాకు అద్భుతమైన స్పందన

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలారోజుల తర్వాత మళ్లీ జోష్ కనిపిస్తోంది. వేసవిలో స్టార్ హీరోల సినిమాలేవి రాకపోవడంతో చాలా డల్‌గా ఉంది. నాని ‘హిట్ 3’ కూడా మే నెలలోనే రిలీజైనప్పటికీ కొన్నిరోజులు మాత్రమే థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. ఇప్పుడు ‘కుబేర’ విషయంలో రిలీజ్‌కి ముందు పెద్ద హడావుడి గానీ హైప్ గానీ లేదు. తొలిఆట తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే తొలిరోజు వసూళ్లలో మంచి నంబర్స్ కనిపించాయి.

తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు గానీ తమిళనాడులో మాత్రం సాంకేతిక కారణాలతో విడుదలకు ముందురోజు బుకింగ్స్ తెరిచారు. అయినా సరే మౌత్ టాక్ ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్‌గానే వస్తోంది. అలా తొలిరోజు తెలుగు, తమిళంలో కలిపి రూ.13 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ నంబర్స్ ఇంకా పెరగొచ్చు అనిపిస్తుంది. చూడాలి మరి ఎంత కలెక్షన్స్ వస్తాయో?

తొలిరోజు వసూళ్లు అంచనాలకు మించి

ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమాకు తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకుడు. తొలిరోజు వసూళ్ల బట్టి చూస్తే ధనుష్‌కి కెరీర్ పరంగా ఇది రెండో బిగ్గెస్ట్ కలెక్షన్ కాగా.. నాగార్జున, శేఖర్ కమ్ములకు మాత్రం ఇదే అత్యధికం. ఎందుకంటే నాగ్ సినిమాలన్నీ తెలుగు వరకు పరిమితం. అందువల్ల ఓ మాదిరి వసూళ్లు వచ్చేవి. ఇక దర్శకుడు కమ్ముల ఇప్పటివరకు సింపుల్ బడ్జెట్ మూవీస్ తీస్తూ వచ్చాడు. కాబట్టి ఈ వసూళ్లు వీళ్లకు ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ములకు గొప్ప విజయం

‘కుబేర’ విషయానికొస్తే.. ఆయిల్ రిగ్‌ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.

కుబేర సినిమా తొలిరోజు వసూళ్లు అంచనాలకు మించి రావడంతో చిత్రబృందం ఆనందంలో మునిగితేలుతోంది. వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

Related News

బోనీ టైలర్ మరణం: సంగీత ప్రపంచంలో పెను విషాదం! కిరాణా షాపు నుంచి గ్లోబల్ స్టార్‌గా.. షాకింగ్!
కార్తీక దీపం 2: సూరజ్-జ్యోత్స్న భార్యాభర్తలా? దీపకు మాలిని అదిరిపోయే ఆఫర్! కార్తీక్ కు షాకే షాక్!
షాకింగ్ ట్విస్ట్! రాజును చంపేందుకు రేఖ కుట్ర? దుగ్గిరాల వారసుడి రహస్యం లీక్ చేసిన చలపతి!
OTTలో ఊచకోత! ఇవాళే 22 కొత్త సినిమాలు, 14 అదిరిపోయేవి, తెలుగులో 8 ట్రెండింగ్ – ఒకే ప్లాట్‌ఫామ్‌లో 7! హారర్ నుండి క్రైమ్ వరకు మాస్ జాతర!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజుకు అమూల్య బిగ్ షాక్! వల్లి పగ రగిలిపోతుంది - సీరియల్ లో ఊహించని ట్విస్ట్!
88 ఏళ్ల వయసులో ANR షాకింగ్ కామెంట్స్! మిల్క్ బ్యూటీ తమన్నాపై మనసుపడ్డ నటసామ్రాట్, అసలు ఏమైందంటే...
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.