|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కుబేర రివ్యూ: బిలినీయర్-బిచ్చగాడు-సీబీఐ ఆఫీసర్ లక్ష కోట్ల స్కామ్ కథ- నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా మూవీ ఎలా ఉందంటే?

Published: 20-06-2025, 4:46 AM
కుబేర రివ్యూ: బిలినీయర్-బిచ్చగాడు-సీబీఐ ఆఫీసర్ లక్ష కోట్ల స్కామ్ కథ- నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా మూవీ ఎలా ఉందంటే?

టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన కుబేర సినిమా ఇవాళ విడుదలైంది. లక్ష కోట్ల స్కామ్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Key Points

1

లక్ష కోట్ల స్కామ్‌లో బిలియనీర్, బిచ్చగాడు, సీబీఐ ఆఫీసర్ పాత్రలు.

2

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటన ఎలా ఉందో తెలుసుకోండి.

4

కుబేర సినిమా రివ్యూ: ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు.

కథాంశం: లక్ష కోట్ల స్కామ్‌లో చిక్కుకున్న ముగ్గురు

నటీనటులు: ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్, దలిప్ తాహిల్, షాయాజీ షిండే తదితరులు

కథ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి

సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి

ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్

నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, అజయ్ కైకాల

నటీనటుల నటన: అంచనాలకు తగ్గట్టుగా?

విడుదల తేది జూన్ 20, 2025

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తెలుగు, తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల నుంచి ఓ సినిమా వస్తుందంటేనే భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి ఆయన సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా వాంటి స్టార్స్ నటించారంటే ఆ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.

ఇలా భారీ అంచనాల నడుమ కుబేర మూవీ ఇవాళ (జూన్ 20) పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా మెప్పించిందా?, నాగార్జున, ధనుష్, రష్మిక ఎలా యాక్ట్ చేశారు? వంటి అన్ని అంశాలను నేటి కుబేర రివ్యూ లో చర్చిద్దాం.

ప్రముఖ వ్యాపారవేత్త నీరజ్ (జిమ్ సర్బ్) బిగ్గెస్ట్ బిలియనీర్. బంగాళఖాతంలో ఏర్పడిన ఆయిల్ నిధిని దక్కించుకునేందుకు పెద్దలతో చేతులు కలుపుతాడు. అయితే వారికి లక్ష కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రూ. 50 వేల కోట్లను వైట్‌గా, మరో 50 వేల కోట్లను బ్లాక్ మనీగా హావాల చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ పని కోసం జైలులో ఉన్న మాజీ సీబీఐ ఆఫీసర్ దీపక్ (నాగార్జున)ను బయటకు తీసుకొస్తాడు నీరజ్. రూ. లక్ష కోట్ల హవాల ప్లాన్‌ను అమలు చేసేందుకు నలుగురు బిచ్చగాళ్ల అవసరం పడుతుంది. ముగ్గురు బిచ్చగాళ్లు పని పూర్తి చేయగా నాలుగో బిచ్చగాడు అయిన దేవా (ధనుష్) తప్పించుకుంటాడు. దాంతో దేవా వెంట దీపక్ టీమ్ పడుతుంది.

అసలు దేవా ఎందుకు తప్పించుకున్నాడు? బిచ్చగాళ్లతో హవాలా ఎలా చేశారు? మిగిలిన ముగ్గురు బిచ్చగాళ్లు ఏమయ్యారు? అసలు ఈ హవాల పనికి దీపక్‌నే బిలియనీర్ నీరజ్ ఎందుకు సెలెక్ట్ చేశాడు? సీబీఐ ఆఫీసర్ అయిన దీపక్ జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఈ క్రమంలో సమీర (రష్మిక మందన్నా) పాత్ర ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే కుబేర మూవీ చూడాల్సిందే.

కుబేర సినిమా: చివరి మాట

శేఖర్ కమ్ముల సినిమా అంటే ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్‌ను పర్ఫెక్ట్‌గా రీచ్ అయ్యారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇది ఒక లక్ష కోట్ల స్కామ్ కథ. ఈ స్కామ్‌లో ఒక బిలినియర్, ఓ బెగ్గర్, ఒక సీబీఐ ఆఫీసర్ ఎలా వచ్చారన్న ఎంగేజింగ్ సీన్లతో సాగే సినిమానే కుబేర .

సినిమా ప్రారంభం నుంచి థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఫస్టాఫ్ అంతా ఏం జరగుతుందా అన్న ఇంటెన్సితో చూసేలా ఉంది. పాత్రల పరిచయం, బినామీగా బిచ్చగాడిగా మారడం, చావు నుంచి తప్పించుకోవడం వంటి సీన్లతో ఎంతో ఎంగేజింగ్‌‌గా సినిమా సాగుతుంది. ఇక సెకండాఫ్ కూడా మెప్పించేలా ఉంటుంది. అయితే, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీతలా అనిపిస్తాయి. కానీ, అవి కూడా బాగుంటాయి.

కథ పరంగా ఆ సన్నివేశాలను పెట్టినట్లు ఉంటాయి. క్లైమాక్స్ కూడా పర్వాలేదు. చూస్తున్నంతసేపు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది కుబేర. ఇక నటీనటుల విషయానికొస్తే.. ధనుష్ అదరగొట్టాడు. అలాంటి పాత్రలో అంతలా ఒదిగిపోయి చేయడం ధనుష్‌కే సాధ్యం. మరో నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు ధనుష్.

అలాగే, నాగార్జునను ఎన్నడూ చూడని విధంగా చూస్తాం. కొన్ని సన్నివేశాల్లో నాగార్జున అదరగొట్టాడు. ఇక రష్మిక మందన్నా ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ధనుష్, నాగార్జున, రష్మిక ఎవరికి వారు నటనతో మెప్పించారు. విలన్‌గా జిమ్ సర్బ్ యాక్టింగ్ బాగుంది. సినిమాకు మరో హీరో అంటే దేవీ శ్రీ ప్రసాద్ .

బీజీఎమ్, సాంగ్స్ అన్నింట్లో సక్సెస్ అయ్యాడు. బోరింగ్ సన్నివేశాల్లో కూడా తనదైన మార్క్ బీజీఎమ్‌తో అలరించాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. సినిమా రిచ్‌గా ఉంది.

ఇక డైరెక్టర్‌గా శేఖర్ కమ్ముల మరోసారి సక్సెస్ అయ్యారు. తన స్టైల్ మేకింగ్‌తో క్రైమ్ థ్రిల్లర్‌ను సోషల్ మెసెజ్‌తో ప్రజంట్ చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే థ్రిల్లింగ్‌గా ఎంగేజ్ చేసే మస్ట్ వాచ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ థ్రిల్లర్ డ్రామా కుబేర.

కుబేర సినిమా లక్ష కోట్ల స్కామ్ నేపథ్యంతో ఆసక్తికరంగా సాగుతుంది. నటీనటుల నటన, కథనం, దర్శకత్వం ఎలా ఉన్నాయో మీరు చూసి తేల్చుకోవాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.