|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kushboo Family: ఇది నిజంగా షాకింగ్.. ఇంతలా మారిపోయారేంటి?

Published: 29-08-2025, 1:48 AM
Kushboo Family: ఇది నిజంగా షాకింగ్.. ఇంతలా మారిపోయారేంటి?

ప్రముఖ నటి ఖుష్బూ కుటుంబం యొక్క అనూహ్యమైన మార్పు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. గతంలో బొద్దుగా కనిపించే ఖుష్బూ మరియు ఆమె కుమార్తెలు ఇప్పుడు చాలా సన్నగా, ఫిట్‌గా కనిపిస్తున్నారు.

Key Points

1

ఖుష్బూ కుటుంబం అంతా సన్నబడి అందరినీ ఆశ్చర్యపరిచారు.

2

గతంలో బరువుతో ఇబ్బంది పడ్డ ఖుష్బూ, కుమార్తెలు ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నారు.

4

ఖుష్బూ కుమార్తెలు సినీరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతుండటం కూడా ఈ మార్పుకు కారణం కావచ్చు.

ఖుష్బూ కుటుంబం లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్

ప్రస్తుతం మనలో చాలామందిని వేధిస్తున్న సమస్య బరువు. అరె ఇలా అయిపోయామేంటి? వెంటనే ఎక్సర్‌సైజ్ చేయాలి, సన్నగా అవ్వాలని అనుకుంటాం. కానీ దాన్ని అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు చాలా కష్టాలు పడుతుంటాం. కానీ ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు ఉంది. తను మాత్రమే కాదు తన కుటుంబాన్ని కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేలా చేసింది. దీంతో ఇప్పుడు ఈమె కుటుంబాన్ని చూసి అందరూ షాకవుతున్నారు.

దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసిన ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళ దర్శకుడు సుందర్‌ని పెళ్లి చేసుకున్న ఈమెకు ఇద్దరు కుమార్తెలు అవంతిక, ఆనందిత కూడా ఉన్నారు. గతంలో ఖుష్బూతో పాటు కూతుళ్లు కూడా కాస్త లావుగా కనిపించేవారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ట్రోల్స్ వచ్చేవి. బరువుపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేసేవాళ్లు. మరి ఈ విషయాన్ని ఖుష్బూ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లుంది.

బరువు తగ్గింపు ప్రయత్నాలు

ఏడాది తిరిగేలోపు ఖుష్బూ కుటుంబంలోని అందరూ లుక్ మార్చేశారు. పైన కనిపిస్తున్న ఫొటోల్లో ఒకటి గతేడాది సెప్టెంబరులో తీసుకున్నది. ఇందులో అందరూ కాస్త బొద్దుగా కనిపించారు. ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత అందరూ సన్నగా మారిపోయి కనిపించారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఖుష్బూ తన ఫ్యామిలీ ఫొటోని పోస్ట్ చేసింది. ఇది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతలోనే ఇంత మార్పు అని మాట్లాడుకుంటున్నారు.

కుమార్తెల సినీ ప్రవేశం?

చాన్నాళ్ల క్రితమే యాక్టింగ్ పక్కనబెట్టిన ఖుష్బూ.. ఓవైపు రాజకీయాల్లోనూ ఉంటూనే మరోవైపు ‘జబర్దస్త్’ లాంటి రియాలిటీ షోల్లో జడ్జిగా కనిపిస్తోంది. ఈమె కూతుళ్లు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బహుశా అందుకే అందరూ ఒకేసారి ఇలా లుక్ మార్చి కనిపించారా అనే సందేహం వస్తోంది.

ఖుష్బూ కుటుంబం యొక్క ఈ అద్భుతమైన మార్పు అందరినీ ఆకట్టుకుంటోంది. వారి కృషి, కట్టుబాటుకు ఇది నిదర్శనం. భవిష్యత్తులో వారి నుండి మరిన్ని అద్భుతాలు ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.