|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠికి ప్రెగ్నెన్సీ క్రేవింగ్.. భార్య కోసం తెగ కష్టపడిపోతున్న మెగా హీరో.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

Published: 15-05-2025, 9:21 AM
Lavanya Tripathi: లావణ్య త్రిపాఠికి ప్రెగ్నెన్సీ క్రేవింగ్.. భార్య కోసం తెగ కష్టపడిపోతున్న మెగా హీరో.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి మరియు మెగా హీరో వరుణ్ తేజ్ దంపతుల జీవితంలోకి ఒక కొత్త అధ్యాయం ప్రవేశించింది. లావణ్య ప్రెగ్నెన్సీలో ఉన్నారని వెల్లడించడంతో, వారి జీవితంలోని తాజా విశేషాలను తెలుసుకుందాం.

Key Points

1

లావణ్య త్రిపాఠికి ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ వస్తున్నాయి.

2

వరుణ్ తేజ్ భార్య కోసం పిజ్జా వండుతున్నాడు.

4

వరుణ్ తేజ్ తాజా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఈ అమ్మడు మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) మాస్టర్(Master), అంతరిక్షం వంటి చిత్రాల్లో నటించింది. ఇక కొద్ది కాలం పాటు ప్రేమించుకున్న వీరిద్దరు పెద్దలను ఒప్పించి 2023లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ లావణ్య మాత్రం కాస్త గ్యాప్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత ఇటీవల ఆమె ‘సతీ లీలావతి’ మూవీతో రాబోతున్నట్లు ప్రకటించింది. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్లు టాక్. ఈ క్రమంలోనే.. లావణ్య తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించి మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రెగ్నెన్సీ తర్వాత లావణ్య ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేస్తుంది.

వరుణ్ తేజ్ సపోర్ట్

తాజాగా, లావణ్య త్రిపాఠి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో లావణ్యకు ప్రెగ్నెన్సీ క్రేవింగ్ రావడంతో వరుణ్ తేజ్ పిజ్జా రెడీ చేసి పెడుతున్నాడు. పుట్టగొడుగులు వేసి చేసిన ఈ పిజ్జాను మైక్రో ఓవెన్‌లో పెట్టగా.. అది చాలా కలర్‌ఫుల్‌గా కనిపించింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇదే అసలైన సమయం ఓ హోటల్ పెట్టొచ్చని అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మీలాంటి భర్త దొరకడం లావణ్య అదృష్టమని అంటున్నారు. కాగా, వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత నుంచి వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోతుంది. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. చివరగా ‘మట్కా’ మూవీతో అలరించారు. ప్రస్తుతం వరుణ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఈ మూవీ vt-15 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ భార్యకు సేవలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.

నెటిజన్ల అభిప్రాయాలు

A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya)

వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠికి అండగా నిలుస్తున్న తీరు ప్రశంసనీయం. వారిద్దరికీ భవిష్యత్తులో శుభం జరగాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.