|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: చిరంజీవిపై ట్రోల్స్.. ఊగిపోయిన మెగా కోడలు లావణ్య! ఫ్యామిలీ జోలికొస్తే అంతే అంటున్న వరుణ్ తేజ్ భార్య!!

Published: 12-02-2026, 3:05 AM
షాకింగ్: చిరంజీవిపై ట్రోల్స్.. ఊగిపోయిన మెగా కోడలు లావణ్య! ఫ్యామిలీ జోలికొస్తే అంతే అంటున్న వరుణ్ తేజ్ భార్య!!
  • చిరంజీవిపై నెటిజన్ల కామెంట్లకు లావణ్య త్రిపాఠి ఘాటు రిప్లై: మెగా ఫ్యామిలీపై ట్రోల్స్ చేస్తే ఊరుకునేది లేదన్న లావణ్య!
  • సతీ లీలావతి ప్రెస్ మీట్‌లో లావణ్య కామెంట్స్: ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదు, ఇది నా ఫ్యామిలీ!
  • రామ్ చరణ్ ట్విన్స్ పుట్టిన సందర్భంగా చిరంజీవిపై విమర్శలు: మనవరాళ్లను సరిగా చూడరని ఆరోపణలు, స్పందించిన మెగా కోడలు.
  • చిరంజీవి గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఊరుకోను: లావణ్య త్రిపాఠి ఫైర్, మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. చిరంజీవి గారి గురించి నెటిజన్లు చేసిన కామెంట్స్‌పై ఘాటుగా స్పందించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి.

చిరంజీవిపై నెటిజన్ల దారుణ కామెంట్స్!

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాటి ప్రస్తుతం పెద్దగా బయట కనిపించడంలేదు. హీరోయిన్ గా ఇండస్ట్రీలో పాపులర్ అయిన లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత కొన్ని విషయాలను పక్కన పెట్టేసింది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా ఉండటం లేదు లావణ్య.

ప్రస్తుతం ఆమె సినిమా ప్రమోషన్స్ ఉంటే తప్ప బయట ఎక్కువగా కనిపించడంలేదు. మెగా కోడలి హోదాను కాపాడుకుంటూ.. తన పని తాను చేసుకువెళ్తుంది. వరుణ్ తేజ్‌తో వివాహం అనంతరం, బాబు పుట్టిన తర్వాత ఆమె ప్రజల్లో మరింత అరుదుగా కనిపిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లావణ్య త్రిపాఠి ఫైర్.. అసలేం జరిగింది?

ఇటీవల రామ్ చరణ్‌కు ట్విన్స్ పుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొంతమంది యాంటీ అభిమానులు చిరంజీవిని ఉద్దేశిస్తూ.. వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. మహిళలకు విలువ ఇవ్వరు, మనవరాళ్లను సరిగా చూడరని ఆరోపిస్తూ నెగిటివ్ కామెంట్లు చేశారు. ఈ తరహా విమర్శలతో ఒక వ్యక్తి ట్వీట్ చేయగా, దానికి లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు. ఒక రకంగా ఆ వ్యక్తికి ఇచ్చిపడేసింది లావణ్య.

నెటిజన్ చిరంజీవికి వ్యతిరేకంగా చేసిన ఆ ట్వీట్‌కు ప్రతిస్పందిస్తూ లావణ్య త్రిపాఠి ఇచ్చిపడేసింది. “అసలు చిరంజీవి గారు మమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? ఆయన చేసిన దాంట్లో కొంచెం కూడా బయట చాలా మంది చేయరు. ఒక ఫ్యామిలీ మంచి ఆనంద సమయంలో ఉన్నప్పుడు వాళ్ల గురించి ఏమి తెలియకుండా ఇలా అంటావా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో స్పందించని లావణ్య ఈసారి ఫైర్ అవుతూ ట్వీట్ చేయడం.. అందరిని ఆశ్చర్యపరిచింది.

సతీ లీలావతి ప్రెస్ మీట్‌లో లావణ్య ఎమోషనల్ కామెంట్స్!

తాజాగా ‘సతీ లీలావతి’ సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ట్వీట్ గురించి ఆమెకు ప్రశ్న ఎదురయ్యింది. ఈ విషయంలో లావణ్య మాట్లాడుతూ.. “నా లైఫ్‌లో మంచి అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. అందరూ నాకు సపోర్ట్ చేశారు. కొంతమంది ఇలా ట్వీట్ చేసిన వాళ్లు కూడా ఉంటారు. ఆ ట్వీట్ గురించి స్పెషల్ గా మాట్లాడాలంటే.. ఒక ఫ్యామిలీ మంచి సెలబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు అలాంటి ట్వీట్స్ ఎందుకు? అది అవసరమా? అది బ్యాడ్ ట్వీట్. ఇది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీని ఎవరైనా అంటే నాకు నచ్చదు, నేను ఊరుకోను” అని స్పష్టం చేశారు.

లావణ్య త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. మెగా ఫ్యామిలీకి ఆమె అండగా నిలవడం అభినందనీయం. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.