|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఘనంగా మెగా వారసుడి నామకరణం.. ఫొటోలు రివీల్ చేస్తూ లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్

Published: 03-10-2025, 12:26 AM
ఘనంగా మెగా వారసుడి నామకరణం.. ఫొటోలు రివీల్ చేస్తూ లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్

మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులకు ఇటీవల మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. తాజాగా వారి కుమారుడి నామకరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తమ కొడుకు పేరు ‘వాయువ్ తేజ్ కొణిదెల’ అని వెల్లడిస్తూ లావణ్య త్రిపాఠి భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు.

Key Points

1

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు సెప్టెంబర్ 10న మగబిడ్డ జననం.

2

అక్టోబర్ 3న మెగా వారసుడి నామకరణ వేడుక ఘనంగా జరిగింది.

4

లావణ్య త్రిపాఠి భావోద్వేగ పోస్ట్‌తో పాటు, ముఖం కనిపించని ఫోటోలు షేర్ చేశారు.

మెగా వారసుడి నామకరణం వేడుక

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న మెగా కోడలు లావణ్య త్రిపాఠి పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. వారసుడి రాకతో మెగా కుటుంబంలో సంబురాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో దాదాపు అందరికీ ఆడపిల్లలే పుట్టగా.. వరుణ్‌ తేజ్‌కు మాత్రం కొడుకు పుట్టాడు. దీంతో అంతా చాలా సంతోషంలో మునిగితేలుతున్నారు. అయితే అందరిలాగానే తమ బాబు ముఖాన్ని మాత్రం మెగా కపుల్ సీక్రెట్‌గా ఉంచుతున్నారు. బాబు మూఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మెగా ఇంట్లో బుల్లి వారసుడి నామకరణం వేడకలు ఘనంగా జరిగాయి. అక్టోబర్ 3వ తేదీన ఈ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మెగా కుటుంబం ఎక్కడా షేర్ చేయలేదు. కానీ. లావణ్య-వరుణ్ మాత్రం సోషల్ మీడియా ద్వారా కొడుకు పేరును రివీల్ చేస్తూ ఫోస్ట్ పెట్టారు. తమ కుమారుడికి తాము ఎంతగానే పూజిస్తున్న ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఆయన పేరు కలిసేలా ‘వాయువ్ తేజ్ కొణిదెల’ (Vaayuv Tej Konidela)పెట్టుకున్నారు.

‘వాయువ్ తేజ్ కొణిదెల’ పేరు వెనుక కథ

ఈ విషయాన్ని వెల్లడిస్తూ కుమారుడితో తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. కానీ అందులో ఆ బాబు ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు పేరు సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు. అలాగే బాబు ముఖాన్ని చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూతురు ‘క్లిన్‌కారా’ విషయంలో చేసినట్లు చేయొద్దని అంటున్నారు. ఆ పాప పుట్టిన రెండేళ్లు అవుతున్నప్పటికీ షేస్ మాత్రం రివీల్ చేయకపోవడం గమనార్హం.

లావణ్య ఎమోషనల్ పోస్ట్: ముఖం దాచిన రహస్యం

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

మెగా వారసుడి నామకరణం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాయువ్ తేజ్ పేరు సూపర్ అని కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు బాబు ముఖాన్ని చూపించాలంటూ కోరుతున్నారు. ఈ వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.