|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లేచింది మహిళా లోకం: మంచు లక్ష్మి మాస్ ట్రీట్! రిలీజ్ డేట్ ఫిక్స్!

Published: 24-03-2026, 3:05 AM
లేచింది మహిళా లోకం: మంచు లక్ష్మి మాస్ ట్రీట్! రిలీజ్ డేట్ ఫిక్స్!
  • మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల కాంబోలో వస్తున్న లేచింది మహిళా లోకం మూవీ!
  • మార్చి 26, 2026న థియేటర్లలో విడుదల కానున్న లేచింది మహిళా లోకం సినిమా!
  • సమాజంలోని సనాతన పద్ధతులను ప్రశ్నిస్తూ వస్తున్న లేచింది మహిళా లోకం మూవీ ట్రైలర్ విడుదల!!
  • హాస్యం, సామాజిక సందేశం మేళవించి అర్జున్ కార్తీక్ దర్శకత్వంలో లేచింది మహిళా లోకం మూవీ!

సమాజంలోని కట్టుబాట్లను ప్రశ్నిస్తూ మంచు లక్ష్మి మరియు అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో వస్తున్న లేచింది మహిళా లోకం మూవీ ఒక సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మార్చి 26, 2026న విడుదల కానుంది.

లేచింది మహిళా లోకం మూవీ స్టోరీ లైన్ ఏంటి?

సమాజంలోని సనాతన పద్ధతులను తలకిందులు చేస్తూ, సరికొత్త కథనంతో అలరించడానికి రెడీగా ఉంది లేచించి మహిళా లోకం సినిమా. మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మార్చి 26, 2026న థియేటర్లలో విడుదల కానుంది. అర్జున్ కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. హాస్యాన్ని, పదునైన సామాజిక పరిశీలనను మేళవించి, సాంప్రదాయక అధికార సమీకరణాలు మారిన సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఎంటర్ట్టైమ్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ను అందించే ఈసినిమా డైలాగ్స్ తో దుమ్మురేపడానికి సిద్దం అవుతోంది. సంభాషణలే ఊపిరిగా సాగే ఈ కామెడీ చిత్రం.. చక్కటి రచన, హాస్యం, ఆసక్తికరమైన సంభాషణలతో ప్రేక్షకులను నవ్విస్తూనే…నిశ్శబ్దంగా ఆలోచింపజేస్తుంది.

సినిమాలో మంచు లక్ష్మి, అనన్య నటన ఎలా ఉండబోతుంది?

ఈ సినిమా ప్రధానంగా సమాజపు కట్టుబాట్లను, లింగ వివక్షను ప్రశ్నిస్తుంది. ఎక్కడా ఘర్షణ పడకుండా, కామెడీ ద్వారానే పాత సంప్రదాయాలను నిలదీస్తుంది. ప్రతీ రోజు సమాజంలో జరిగే విషయాలను తీసుకుని.. అద్భుతమైన స్క్రీన్ ప్లేను రాసుకున్నారు. కొన్ని ఊహాత్మక సన్నివేశాలను అద్భుతంగా వాడుకున్నారు. సినిమాకు డైలాగ్స్ అతిపెద్ద బలం. అవి ఒకవైపు కామెడీ టైమింగ్‌ను నడిపిస్తూనే, మరోవైపు సినిమా ఇవ్వాలనుకున్న సందేశాన్ని అంతే బలంగా మోసుకెళ్తాయి.

ఈ సినిమాతో దర్శకుడు అర్జున్ కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నారు?

ఈ చిత్రానికి ప్రతిభావంతులైన ద్వయం అర్జున్-కార్తీక్ రచన, దర్శకత్వం వహించారు. వినోదానికి సామాజిక సందేశాన్ని మేళవించి వారు తమ మార్క్ తో అద్భుతం చేశారు. ఇద్దరి ఆలోచనల వల్ల సినిమా టోన్ ఎక్కడా పక్కదారి పట్టలేదు. హాస్యం వల్ల తాము ఇవ్వాలనుకున్న మెసేజ్ కు ఎక్కడా దెబ్బ తగలకుండా జాగ్రత్త పడ్డారు. బృహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ డిజిటల్ తో కలిసి స్టోరీ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సందేశంతో కూడిన వినోదాత్మక సినిమాలను ప్రేక్షకులకు అందించాలన్నది వారి లక్ష్యం. సామాజిక అవగాహన, కామెడీ కలగలిసిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తూనే నమ్మకాన్ని మూవీ టీమ్ వెల్లడించారు. చూడాలి ఈసినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.

లేచింది మహిళా లోకం సినిమా విడుదల కోసం ఎదురుచూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.