|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భారత్‌లో LPG సంక్షోభం! ఫోన్లు, ఇంటర్నెట్‌పై పెను ప్రభావం!

Published: 10-03-2026, 4:05 PM
భారత్‌లో LPG సంక్షోభం! ఫోన్లు, ఇంటర్నెట్‌పై పెను ప్రభావం!
  • మిడిల్ ఈస్ట్ యుద్ధాల కారణంగా భారతదేశంలో LPG కొరత ఏర్పడింది.
  • టెలికాం టవర్ల ఉత్పత్తికి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో నెట్‌వర్క్ విస్తరణకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.
  • LPG కొరత కారణంగా మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది.
  • భారతదేశంలో LPG ఉత్పత్తిని 10% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మిడిల్ ఈస్ట్ దేశాల్లోని యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో LPG కొరత ఏర్పడింది. దీని ప్రభావం మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలపై పడే అవకాశం ఉంది. టెలికాం టవర్ల తయారీకి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో సమస్య మరింత జఠిలమైంది.

LPG కొరతకు కారణమైన యుద్ధ వాతావరణం

మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ ను టార్గెట్ చేయకుండా మిడిలిస్ట్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దీని ఎఫెక్ట్ కారణంగా ఇండియాలో LPG కొరత ఏర్పడింది. ఎల్పిజి కొరత ఏర్పడిన నేపథ్యంలో హోటల్స్ యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అడుగు గృహ వినియోగదారులకు కూడా గ్యాస్ సిలిండర్లు దొరికే పరిస్థితులు లేవని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇలాంటి నేపథ్యంలో ఈ ఎల్పీజీ కొరత మొబైల్స్, ఇంటర్నెట్ సేవల పైన కూడా పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

టెలికాం టవర్లపై LPG కొరత ప్రభావం

టెలికాం టవర్ తయారీ సంస్థలకు సప్లై చేసే గ్యాస్ పూర్తిగా నిలిచిపోయింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా టెలికాం టవర్లు తుప్పు పట్టకుండా తయారీ సమయంలో జింక్ తో వేసే రక్షణ పొర కోసం ఎల్పీజీ వాడతారని చెబుతున్నారు. ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్ కోసం తగిన LPG లేకపోతే ఆపరేషన్ పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని ప్రొడక్షన్ చేసేవారు స్పష్టం చేస్తున్నారు. దీని ఎఫెక్ట్ కారణంగా నెట్వర్క్ విస్తరణ నెమ్మదించి కనెక్టివిటీపై ప్రభావం పడుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో మొబైల్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఇంటర్నెట్ వ్యవస్థ లేకపోతే భారతదేశం మొత్తం స్థంభించే ప్రమాదం ఉంటుంది.

ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలు

భారతదేశంలో LPG ఉత్పత్తిని పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. LPG కొర‌త‌ ఏర్పడుతున్న కేంద్ర కేబినెట్ అత్య‌వ‌స‌రంగా ఏర్పాటు అయింది. ఈ త‌రుణంలో భారతదేశ వ్యాప్తంగా 10% LPG ఉత్ప‌త్తిని పెంచాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది.

దేశంలో LPG కొరత తీవ్రంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ నిర్ణయం ప్రజలకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.