|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

LPG సంక్షోభం! రిలయన్స్ సంచలన నిర్ణయం! సామాన్యులకు ఊరట!

Published: 10-03-2026, 3:35 PM
LPG సంక్షోభం! రిలయన్స్ సంచలన నిర్ణయం! సామాన్యులకు ఊరట!
  • మిడిల్ ఈస్ట్ యుద్ధాల కారణంగా దేశంలో LPG కొరత ఏర్పడింది.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ LPG ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది.
  • ప్రధాని మోడీ అధ్యక్షతన గ్యాస్ ఉత్పత్తిని 10% పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
  • గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ నివారణకు కేంద్రం కఠిన చర్యలు తీసుకోనుంది.

మిడిల్ ఈస్ట్ లోని యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో LPG కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ LPG ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.

దేశంలో LPG కొరతకు కారణం?

మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియాలో చమురు కొరత స్పష్టంగా కనిపిస్తోంది. హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా ఆగిపోయిన నేపథ్యంలో ఇండియాకు దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. దీనివల్ల తాత్కాలికంగా ఇండియాలో చమరు కొరత ఏర్పడింది. అంతేకాదు భారత దేశ వ్యాప్తంగా LPG కొరత కూడా క్రమ క్రమంగా పెరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ఇంధన మార్కెట్స్ లో అస్థిరత ఉన్న తరుణంలో ఎల్పీజీ ఉత్పత్తి పెంచుతున్నట్లు తాజాగా ప్రకటన చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్.

రిలయన్స్ తీసుకున్న కీలక నిర్ణయం

భారతదేశ ప్రజలకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించింది రిల‌య‌న్స్. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తూ జామ్ నగర్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ హబ్ లో ఎల్పీజీ ఉత్పత్తిని ( LPG production) పెంచబోతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. భారతీయ ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని మరోసారి గుర్తు చేసింది రిలయన్స్. భారతదేశ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటామని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం చర్యలు

కరోనా సమయంలో కూడా రిలయన్స్ ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. ఇక ఇప్పుడు యుద్ధం కారణంగా తలెత్తిన ఎల్పీజీ కొరత సమస్యకు చెక్ పెట్టేందుకు రిలయన్స్ ( Reliance) ముందడుగు వేసింది. అదే సమయంలో ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన తాజాగా కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా 10% గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. క్లిక్

దేశంలో గ్యాస్ కొరత నివారణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందడుగు వేయడం, కేంద్రం ఉత్పత్తిని పెంచడం ప్రజలకు ఊరటనిచ్చే అంశం. బ్లాక్ మార్కెటింగ్ నివారణ చర్యలు సత్ఫలితాలనివ్వాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.