|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ ‘మాయకూతు’.. రైటర్ పాత్రలు నిజ జీవితంలో కనిపిస్తే.. 9.6 ఐఎండీబీ రేటింగ్

Published: 27-08-2025, 11:55 AM
ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ ‘మాయకూతు’.. రైటర్ పాత్రలు నిజ జీవితంలో కనిపిస్తే.. 9.6 ఐఎండీబీ రేటింగ్

తమిళంలో వచ్చిన ‘మాయకూతు’ అనే ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో రచయిత రాసిన పాత్రలు నిజ జీవితంలోకి వస్తాయి. 9.6 ఐఎండీబీ రేటింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Key Points

1

9.6 IMDb రేటింగ్‌తో సూపర్ హిట్ తమిళ సినిమా ‘మాయకూతు’

2

రచయిత రాసిన కథల్లోని పాత్రలు నిజ జీవితంలోకి వస్తాయి

4

సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం

‘మాయకూతు’ ఓటీటీ విడుదల

తమిళంలో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ వస్తూనే ఉంటాయి. వివిధ జోనర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. ఇలా డిఫరెంట్ జోనర్లో, విభిన్నమైన కథతో తెరకెక్కిన సినిమానే ‘మాయకూతు’ (Maayakoothu). ఓ రైటర్ రాసే రచనల్లోని పాత్రలు నిజ జీవితంలోనూ ఎదురైతే ఎలా ఉంటుంది పరిస్థితి అనే స్టోరీ లైన్ తో వచ్చింది ఈ మూవీ. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది.

తమిళ ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ ‘మాయకూతు’ ఓటీటీ లోకి వచ్చింది. ఈ సినిమా ఇవాళ (ఆగస్టు 27) సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే స్ట్రీమింగ్ మొదలైంది. అయితే కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. మంచి థ్రిల్ కావాలనే ఆడియన్స్ ఈ మూవీని మిస్ కావొద్దు.

రచయిత కథల్లోని పాత్రల ఆవిర్భావం

మాయకూతు మూవీ ఈ ఏడాది జులై 11న థియేటర్లలో రిలీజైంది. ఆడియన్స్ కు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందించిన ఈ మూవీకి థియేటర్లో అదిరే రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ రివ్యూలతో దూసుకెళ్లింది ఈ సినిమా. డిఫరెంట్ స్టోరీ లైన్ తో థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు ఐఎండీబీ లో ఏకంగా 9.6 రేటింగ్ దక్కడం విశేషం.

ఏఆర్ రాఘవేంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాగరాజన్ కన్నన్ లీడ్ రోల్ ప్లే చేశాడు. ఢిల్లీ గణేష్, ము రామస్వామి, సాయి ధీన, ఎస్కే గాయత్రి తదితరులు నటించారు. రాహుల్ మూవీ మేకర్స్, అభిమన్యు క్రియేషన్స్ బ్యానర్లపై రాహుల్ దేవ, ప్రసాద్ రామచంద్రన్ నిర్మించారు.

అద్భుతమైన థ్రిల్లింగ్ అనుభవం

ఓ రైటర్ రచనల్లోని ఫిక్షనల్ క్యారెక్టర్లు అన్ని రియల్ వరల్డ్ లోకి వస్తాయి. ఆ క్యారెక్టర్లు తమకు న్యాయం జరగాలని ప్రశ్నిస్తాయి. ఆ రైటర్ ను ఫోర్స్ చేస్తాయి. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీనే మాయకూతు. ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ కు కిక్ ఇచ్చింది.

వాసన్ (నాగరాజన్ కన్నన్) ఓ పాపులర్ రచయిత. కథలు రాస్తుంటాడు. ఇందులో రూ.2 వేల నోటు దొంగతనం చేసే ఓ పని మనిషి, 50వ మర్డర్ చేయాలని చూసే గ్యాంగ్ స్టర్, మెడికల్ స్కూల్ లో చదవాలనుకునే ఓ రైతు కూతురు.. ఇలాంటి వేర్వేరు కథలుంటాయి. ఈ కథల్లోని పాత్రలన్నీ రైటర్ నిజ జీవితంలోకి వస్తాయి. తమకు న్యాయం కావాలని ప్రశ్నిస్తాయి. మరి చివరకు ఏం జరిగింది? ఆ రైటర్ ఏం చేశాడన్నదే కథ.

తన కల్పనలోని పాత్రలు నిజ జీవితంలో కనిపించడం వల్ల రచయిత ఎదుర్కొన్న సవాళ్లు, అతని ప్రతిస్పందనలు ‘మాయకూతు’ సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. 9.6 ఐఎండీబీ రేటింగ్ దీనికి నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.