|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజమౌళి వారణాసిలో మాధవన్ సంచలనం: హనుమంతుడిగా విశ్వరూపం! ప్రకటనతో అభిమానుల్లో ఆనందం!

Published: 26-02-2026, 10:35 AM
  • రాజమౌళి వారణాసి సినిమాలో మాధవన్ నటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు.
  • సినిమాలో తన పాత్ర గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని మాధవన్ తెలిపారు.
  • మాధవన్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల సమాచారం.
  • రామాయణం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.

ప్రముఖ నటుడు మాధవన్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాధవన్ స్వయంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వారణాసి సినిమాలో మాధవన్ పాత్రపై ప్రకటన

Actor Madhvan:  సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు మాధవన్ (Madhvan)ప్రస్తుతం హీరోగా మాత్రమే కాకుండా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన సౌత్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నారు. త్వరలోనే మాధవన్ నటించిన దురంధర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ రాజమౌళి వారణాసి (Varanasi)సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా మాధవన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. వారణాసి కోసం రాజమౌళి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారని ఈ సినిమాలో మైథాలజీ నేపథ్యంలో రామాయణం భాగాన్ని చాలా వివరంగా చూపించబోతున్నారని తెలిపారు .అదే  విధంగా వారణాసి సినిమాలో నా పాత్ర చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. తెరపై నా పాత్ర చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ అంటూ ఈయన ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని లీక్ చేశారు .

హనుమంతుడిగా మాధవన్ అద్భుత నటన?

వారణాసి సినిమాలో మాధవన్ నటించబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు రాజమౌళి మాత్రం ఈయన పాత్రను అధికారకంగా వెల్లడించలేదు. అయితే తాజాగా మాధవన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలియజేయడమేకాకుండా తన పాత్ర గురించి ఎంతో గొప్పగా చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన ఏ పాత్రలో కనిపించబోతున్నారనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. సినీ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం మాధవన్ వారణాసి సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

వారణాసి సినిమాలో మైథాలజీ నేపథ్యంలో రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్ ఉండబోతున్న నేపథ్యంలో ఇందులో రాముడిగా మహేష్ బాబు కనిపించబోతున్నారు. హనుమంతుడి పాత్ర కోసం మాధవన్  ను రాజమౌళి ఎంపిక చేశారని తెలుస్తోంది. తాజాగా మాధవన్ చేసిన ఈ కామెంట్స్ ద్వారా ఈయన ఈ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నటుడు ప్రకాష్ రాజ్, పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా వంటి తదితరులు నటించబోతున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి సినిమాలో మైథాలజీ ప్రాధాన్యత

మాధవన్ వారణాసి సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుడి పాత్రలో ఆయన ఎలా మెప్పిస్తారో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.