
📌 Key Points
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది దుర్మరణం
- నాసిక్ జిల్లా దిండోరి సమీపంలో ఘటన, ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి
- బావిలో పడిన ఎంపీవీ వెహికల్, ఆరుగురు చిన్నారులు మృతి
- కోచింగ్ క్లాస్ గెట్ టు గెదర్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా దిండోరి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బావిలో పడటంతో ఈ విషాదం జరిగింది.
దిండోరిలో విషాదం: బావిలో పడిన కారు
మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నాసిక్ జిల్లా దిండోరి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వెళ్తోన్న ఎంపీవీ వెహికల్ అదుపుతప్పి.. ఫుల్లుగా వాటర్ ఉన్న లోతైన బావిలో పడిపోయింది. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న 9 మందీ చనిపోయారు. మృతులలో ఆరుగురు చిన్నారులు ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మృతులు ఒక కోచింగ్ క్లాస్ గెట్ టు గెదర్ కు వెళ్లి, తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి 10 గంటల సమయంలో శివాజీనగర్ ప్రాంతంమీదుగా వెళ్తుండగా.. చీకటిలో డ్రైవర్ కు అక్కడ బావి ఉన్నట్లుగా కనిపించకపోవడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. దిండోరి పోలీస్ ఇన్ స్పెక్టర్ మథురే నేతృత్వంలోని రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని రెండు హైడ్రా క్రేన్లు, ఈతగాళ్ల సహాయంతో వాహనాన్ని బావిలో నుంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అర్ధరాత్రి 12.15 గంటలకు వాహనాన్ని, అందులోనే మరణించిన మృతదేహాలను వేలికి తీశారు. మృతులను సునీల్ దత్తు దర్గుడే (32), రేష్మా సునీల్ దర్గుడే (27), ఆశా అనిల్ దర్గుడే (32),
ప్రమాదానికి కారణాలు ఏమిటి?
ఖుషీ అనిల్ దర్గుడే (14), మాధురి అనిల్ దర్గుడే (13), శ్రేయాస్ అనిల్ దర్గుడే (11), రాఖి (గుణవంతి) సునీల్ దర్గుడే (11), శ్రావణి అనిల్ దర్గుడే (11), సమృద్ధి రాజేంద్ర దర్గుడే (7)గా గుర్తించారు. 9 మంది మృతి వారి తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది.
ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని కోరుకుందాం.


