|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కలెక్షన్లలో తగ్గేదేలే.. కుమ్మేస్తున్న మహావతార్ నరసింహ.. కింగ్డమ్ ఉన్నా తగ్గని జోరు.. 100 శాతం పెరిగిన వసూళ్లు

Published: 03-08-2025, 12:46 PM
కలెక్షన్లలో తగ్గేదేలే.. కుమ్మేస్తున్న మహావతార్ నరసింహ.. కింగ్డమ్ ఉన్నా తగ్గని జోరు.. 100 శాతం పెరిగిన వసూళ్లు

హోంబలే ఫిలింస్ నిర్మించిన యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రెండో వారంలోనూ అనూహ్యంగా పెరిగిన వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పోటీ చిత్రాల మధ్యన ఈ చిత్రం సాధించిన విజయం ఆశ్చర్యం కలిగించేది.

Key Points

1

రెండో వారంలోనూ అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తున్న మహావతార్ నరసింహ.

2

రెండో శనివారం 100% పెరిగిన వసూళ్లు – రూ.15.4 కోట్లు.

4

హోంబలే ఫిల్మ్స్ మరిన్ని యానిమేటెడ్ సినిమాలను ప్రకటించింది.

మహావతార్ నరసింహ: అనూహ్య విజయం

హోంబలే ఫిలింస్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా రన్ అవుతోంది. ప్రహ్లాదుడి కథ, మహావతార్ నరసింహుడి ఎదుగుదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అభిమానుల మనసులను గెలుచుకుంది. రెండో వారాంతంలో 100 శాతం వసూళ్లు రాబట్టింది.

మహావతార్ నరసింహ మూవీ కలెక్షన్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ తాజా అప్డేట్ ప్రకారం.. మహావతార్ నరసింహ రెండవ శనివారం (ఆగస్టు 2) రూ.15.4 కోట్లు వసూలు చేసింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే 100 శాతం పెరిగి అదనంగా రూ.7.7 కోట్లు రాబట్టింది. రెండో వారంలో ఇంత భారీ వసూళ్లు రాబట్టడం ఊహించనిదే. ఈ సినిమా చూసిన అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ రావడమే మరింత ఊపునిస్తోంది.

రెండో వారం వసూళ్లు: 100% పెరుగుదల

వీకెండ్ కావడంతో ఈ రోజు (ఆగస్టు 3) ముగిసే సరికి మహావతార్ నరసింహా అత్యధిక వన్ డే కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇవాళ రూ.13.4 కోట్లు (సాయంత్రం 6.30 గంటలకల్లా) వసూలు చేసింది. జులై 25న థియేటర్లకు వచ్చిన ఈ మూవీ మొత్తం కలెక్షన్లు ఇప్పటివకూ రూ.81.25 కోట్లుగా ఉన్నాయి.

బాక్సాఫీస్ దగ్గర మహావతార్ నరసింహాకు పోటీ ఉన్నా కలెక్షన్లలో మాత్రం అదరగొడుతోంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ , అజయ్ దేవగణ్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2, సిద్ధాంత్ చతుర్వేది-తృప్తి దిమ్రీ నటించిన ధడక్ 2 వంటి కొత్త సినిమాల నుంచి ఈ చిత్రం గట్టి పోటీని ఎదుర్కొంటుంది. అయినా ఈ యానిమేటెడ్ మూవీ ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించడం షాకింగ్ గా ఉంది.

పోటీ సినిమాల మధ్యన విజయం

రెండో వారంలో విడుదలైన అన్ని సినిమాల కంటే మహావతార్ నరసింహా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్ సంయుక్తంగా మరిన్ని యానిమేటెడ్ చిత్రాలను విడుదల చేయబోతున్నాయి. మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధవకదేశ్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి (2035-2037).. ఇవీ ఈ ఫ్రాంచైజీలో రాబోయే టైటిల్స్. ఇదే నిర్మాణ సంస్థ అక్టోబర్ 2న విడుదల కానున్న ‘కాంతార: చాప్టర్ 1’కు సిద్ధమవుతోంది.

మహావతార్ నరసింహ యొక్క విజయం తెలుగు యానిమేషన్ సినిమాకు మంచి అవకాశాలను తెరిచింది. హోంబలే ఫిల్మ్స్ భవిష్యత్తులో మరిన్ని యానిమేటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.