‘మహావతార్ నరసింహ’ అనిమేషన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఇండియన్ ఆల్ టైమ్ రికార్డును కూడా స్థాపించింది.
Key Points
8 రోజుల్లో రూ. 60.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
ఇండియన్ ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
అద్భుతమైన బాక్స్ ఆఫీస్ వసూళ్లు
‘మహావతార్ నరసింహ’ యానిమేటెడ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది . ఎలాంటి తారాగణం లేకుండానే విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డ్ లను క్రియేట్ చేసింది . కలెక్షన్ల పరంగా ఇప్పుడు ఏకంగా ఇండియన్ ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది . ‘ మహావతార్’ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా జులై 25 న విడుదలైన ఈ చిత్రం చాలాచోట్ల థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి . బుక్ మైషోలో ఏకంగా ప్రతిరోజు రెండు లక్షలకు పైగా టికెట్లు తెగుతున్నాయి . క్లీమ్ ప్రొడక్షన్స్, ప్రఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి . తెలుగులో గీతా అర్ట్స్ నుంచి అల్లు అరవింద్ విడుదల చేశారు .
దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ‘ మహావతార్ నరసింహ ‘ సినిమాను చూసేందుకు పిల్లలు నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులు వెళ్తున్నారు . దీంతో 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ . 60.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది . ఇప్పటి వరకు ఇండియన్ సినిమా మార్కెట్ లో విడుదలైన అన్ని యానినేషన్ సినిమాల తాలూకా వసూళ్ల రికార్డులను మహావతార్ దాటేసింది . ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది . ఇక ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా ఇదే రేంజ్ ఓపెనింగ్స్ సాధించింది. ఏకంగా వన్ మిలియన్ క్లబ్ లో కూడా చేరింది . ప్రపంవ్యాప్తంగా అన్ని భాషలలో ఇప్పటికీ అదే స్ట్రాంగ్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇది డివైన్ బ్లాక్‌బస్టర్ అని చిత్ర మేకర్స్ పేర్కొన్నారు .
రికార్డు స్థాయి కలెక్షన్స్
ప్రేక్షకుల స్పందన
మహావతార్ నరసింహ చిత్రం భారీ విజయం సాధించి, అనిమేషన్ చిత్రాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని తెరిచింది. ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం కొనసాగుతుందని భావిస్తున్నారు.


