|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేష్ బాబు ఫస్ట్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్! ఇప్పుడు ఒక్క సినిమాకు ఎన్ని కోట్లో తెలుసా? వైరల్ న్యూస్!

Published: 20-03-2026, 2:35 AM
  • సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ రెమ్యునరేషన్ కేవలం ₹10,000 మాత్రమే – షాకింగ్ నిజం!
  • ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్న మహేష్ బాబు రికార్డు.
  • రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీతో మహేష్ బాబు గ్లోబల్ ఎంట్రీ!
  • మహేష్ బాబు ఒక్క యాడ్ ఫిల్మ్ కు రూ.5-10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారని సమాచారం.

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఒక సంచలన వార్త! ఆయన మొదటి రెమ్యునరేషన్ నుండి నేటి స్టార్‌డమ్ వరకు ఎన్నో ఆసక్తికర విషయాలు మీకోసం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది!

మహేష్ బాబు మొదటి సంపాదన ఎంత?

సూపర్ స్టార్ కృష్ణ తరువాత ఆయన వారసత్వాన్ని అంతకు మించి నిలబెట్టిన హీరో మహేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న మహేష్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా సత్తా చాటారు. ఎన్నో అవార్డులు కూడా సాధించాడు. బాలనటుడిగా ద్విపాత్రాభినయంచేసిన రికార్డు కూడా మహేష్ బాబు సొంతం. ప్రస్తుతం హీరోగా వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మహేష్ బాబు.. హీరో కాకముందు బాలనటుడిగా ఎంత పారితోషికం తీసుకున్నాడు. ఆయన ఫస్ట్ సినిమాకు తీసుకున్న డబ్బు ఎంత?

చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి చూపిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్షన్ సీన్స్ కూడా చేశాడు మహేష్. ముఖ్యంగా.. కొడుకు దిద్దిన కాపురం సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం ద్వారా ఆయన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆ సమయంలోనే తన తండ్రి క్రిష్ణ.. నిర్మాతగా మహేష్ కు ఇచ్చిన పారితోషికం గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు రెమ్యునరేషన్ రికార్డ్

మహేష్ బాబు మొదటి సంపాదన 10,000 పొందినట్టు తెలుస్తోంది. గతంలొ కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు దాదాపు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. అంతే కాదు ఒక్క యాడ్ ఫిల్మ్ కు మహేష్ 5 నుంచి 10 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది.

రాజమౌళితో మహేష్ బాబు పాన్ వరల్డ్ ఎంట్రీ

మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా బిజీలో ఉన్నాడు. ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తొలిసారిగా పాన్ వరల్డ్ స్థాయిలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రధానంగా తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా ఆయన గ్లోబల్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరచుకోవాలని భావిస్తున్నారు.

మహేష్ బాబు కెరీర్ ఎన్నో మలుపులు తిరిగింది. ఆయన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఆయన అభిమానులకు ఇది నిజంగా పండగే!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.