|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజమౌళి షాకింగ్ రిప్లైతో మహేష్ బాబుకు మైండ్ బ్లాక్! అసలేం జరిగిందంటే..?

Published: 04-02-2026, 12:05 AM
రాజమౌళి షాకింగ్ రిప్లైతో మహేష్ బాబుకు మైండ్ బ్లాక్! అసలేం జరిగిందంటే..?
  • రాజమౌళి సినిమాలో నటించడం ఆనందంగా ఉందని మహేష్ బాబు మెసేజ్
  • హీరోలను బాగా చూపిస్తారని రాజమౌళికి మెసేజ్ చేసిన మహేష్
  • విలన్స్ అంటేనే ఇష్టమని మహేష్ బాబుకు రిప్లై ఇచ్చిన రాజమౌళి
  • విలన్ ఎంత భయపెడితే హీరో అంత గ్రేట్ అవుతాడని తెలిపిన పృథ్వీరాజ్

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా మొదలయ్యాక వీరిద్దరి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన చాటింగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వివరాలు చూద్దాం!

రాజమౌళికి మెసేజ్ చేసిన మహేష్ బాబు

Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. హాలీవుడ్ రేంజ్ లో రాజమౌళి గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. వారణాసి గ్లింప్స్ రిలీజయిన సమయంలో రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాలీవుడ్ లో స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా ఆ ఇంటర్వ్యూలు విడుదల చేయగా అందులో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.(Mahesh Babu)

ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమా ఓకే అయ్యాక రాజమౌళితో జరిగిన చాటింగ్ గురించి తెలిపాడు.

షాకింగ్ రిప్లై ఇచ్చిన రాజమౌళి

మహేష్ బాబు మాట్లాడుతూ.. మా ఇంటికి వచ్చి రాజమౌళి లంచ్ లో కూర్చొని సినిమా చేద్దాం అని డిస్కస్ చేసాము. ఎలాంటి సినిమా చేయాలి అని రాజమౌళి అడిగాడు. నేనేం చెప్తాను రాజమౌళి లాంటి డైరెక్టర్ కి మీ ఇష్టం అన్నాను. డిస్కషన్ అంతా అయ్యాక సినిమా చేద్దాం అని ఫిక్స్ అయ్యాము. అతను ఇంటికి వెళ్ళాక మీ సినిమాలో చేయడం హ్యాపీగా ఉంది. మీ సినిమాలో హీరోలను బాగా చూపిస్తారు అది నాకు ఇష్టం. మీరు హీరోలను బాగా ఇష్టపడతారు అని మెసేజ్ పెట్టాను. దానికి రాజమౌళి.. కానీ నాకు విలన్స్ అంటేనే ఎక్కువ ఇష్టం అని రిప్లై ఇచ్చాడు. దానికి నాకు ఏం చెప్పాలో తెలియక స్మైల్ సింబల్ ఇచ్చాను అని తెలిపారు.

విలన్స్ గురించి పృథ్వీరాజ్ కామెంట్స్

ఇదే ఇంటర్వ్యూలో ఉన్న పృథ్వీరాజ్.. విలన్ ఎంత భయపెడితే హీరో అంత గ్రేట్ అవుతాడు అని చెప్పుకొచ్చాడు.

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.