|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పసి ప్రాణాలకు మహేశ్ బాబు రక్షణ.. ఇలా సాయం చేయడానికి కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Published: 04-09-2025, 4:58 AM

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. తన కొడుకు గౌతమ్ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో MB ఫౌండేషన్ స్థాపించి పేద పిల్లలకు సహాయం చేస్తున్నారు.

Key Points

1

మహేష్ బాబు గౌతమ్ పుట్టుకతో వైద్య సాయం అవసరం గురించి తెలుసుకున్నారు.

2

MB ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు అందిస్తున్నారు.

3

ఇప్పటివరకు వేలమంది పిల్లలకు వైద్య సహాయం అందించారు.

4

తన సంపాదనలో 30% సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు.

మహేష్ బాబు సేవా కార్యక్రమం

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతుంటారు. అందులో భాగంగా చిన్నారుల గుండె సంబంధిత సమస్యలకు శస్త్రచికిత్సలు ఉచితంగా చేయిస్తారు. ఇప్పటివరకు మహేష్ బాబు వెయ్యికి పైగా ఆపరేషన్స్ చేయించారు. అసలు మహేష్ ఇలా చిన్నపిల్లలకు వైద్య సాయం చేయడానికి వెనుక అసలు కారణం ఏంటో తాజాగా చెప్పుకొచ్చారు.

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించే ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షోలో మహేష్ బాబు తన ఆలోచన వెనుక ఉన్న నిజాన్ని వెల్లడించారు. చిన్న పిల్లలకు వైద్య సాయం చేయడానికి, సేవా కార్యక్రమం వెనుక అసలు కారణాన్ని అభిమానులతో పంచుకున్నారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘గౌతమ్ ఆరు వారాల ముందు పుట్టాడు. వాడిది ప్రీమెచ్యూర్డ్ బర్త్’అని చెబుతూ బాధ పడ్డారు. సాధారణ డెలవరీ కంటే ముందుగా పుట్టడం వల్ల అలాంటి పిల్లలలో సరైన డెవలప్ మెంట్ ఉండదు. అలాంటి వారిలో శ్వాస, వేడి, ఫీడింగ్ సమస్యలు ఉంటాయి. అందుకే పుట్టిన వెంటనే NCIUలో ఉంచాం,” అని పేర్కొన్నారు.

ఆ సమయంలో గౌతమ్ అతి చిన్న, తన అరచేతి పొడవు మాత్రమే ఉన్నాడని, ఆ తరువాత గౌతమ్ ఆరోగ్యం క్రమంగా సెట్ అయ్యిందని తెలిపారు. ఇప్పుడు గౌతమ్ 6 అడుగుల పొడవు ఉన్నాడంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో తన కొడుకు రక్షణ కోసం లక్షల్లో ఖర్చు చేసి కాపాడుకున్నాననీ మహేష్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు.

గౌతమ్ పుట్టుక వెనుక కథ

“మాకు డబ్బులు ఉన్నందున బతికించుకోగలిగాం, కానీ పేదల పరిస్థితి ఏంటో ఆలోచించాను,” అని చెప్పారు. ఇదే ఆలోచన MB ఫౌండేషన్ స్థాపించడానికి కారణమైందని ఆయన చెప్పారు. MB ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు ఉచిత హార్ట్ ఆపరేషన్, క్రిటికల్ సిచ్యుయేషన్‌లో ఉన్నవారికి వైద్య ఖర్చులు, వైద్య సదుపాయం అందిస్తున్నట్లు మహేష్ బాబు వెల్లడించారు.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత గుండె ఆపరేషన్లు అందించేందుకు మ‌హేశ్ బాబు ఫౌండేష‌న్ ను స్థాపించారు. ఫౌండేషన్ వెబ్‌సైట్ ద్వారా డైరెక్ట్‌గా రిక్వెస్ట్ పెట్టే అవకాశం కల్పించడం విశేషం. మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ను ఆయన తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి 2020లో స్థాపించారు. మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఏటా సుమారు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం.

మహేష్ బాబు తన సంపాదనలో సుమారు 30% భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారట. మ‌హేశ్ బాబు ఫౌండేష‌న్ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 4,500కి పైగా స‌ర్జ‌రీలు జ‌రగ‌డం విశేషం. ఉచిత వైద్య శిబిరాలు, బాలికలకు గర్భకోశ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లు వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతను కూడా కొనసాగిస్తూ అభిమానులకు నిజమైన హీరోగా నిలిచారు. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆయన చేసిన ప్రయత్నాలు నిజంగా ప్రశంసనీయమైనవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

MB ఫౌండేషన్ యొక్క ప్రభావం

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న చిత్రం ‘SSMB29’ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. 2021లో సినిమా లేకపోవడం వల్ల కొంత విరామం తీసుకున్న మహేష్ బాబు, దర్శకుడు పరశురాంతో కలిసి పని చేసిన తర్వాత 2022లో ‘సర్కారు వారి పాట’ విడుదల చేశారు. కీర్తి సురేష్ ప్రధాన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది.

ఆ తరువాత భారీ అంచనాల మధ్య మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో ‘SSMB29’ రాబోతుంది. ఈ గ్లోబల్ మూవీలో మహేష్ బాబు నటిస్తున్నట్టు ప్రకటించినప్పటి నుండి సినిమా పై భారీ బజ్ నెలకొంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతంది. ఇటీవల ఒడిశా షెడ్యూల్ పూర్తయింది. ‘SSMB29’విడుదల కోసం కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు సినిమా లవర్స్ ఇగర్ గా వేయిట్ చేస్తున్నారు.

మహేశ్ బాబు సేవా గుణం అభినందనీయం. పేదలకు చేసే సహాయం నిజమైన మానవత్వం. MB ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎందరో పసిపిల్లలకు జీవితం అందిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.