
📌 Key Points
- రాజమౌళితో మహేష్ బాబు వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.
- గత 15 ఏళ్ల క్రితమే ఈ సినిమా చేయాల్సి ఉండగా, రాజమౌళి ఇతర ప్రాజెక్టుల వల్ల ఆలస్యమైంది.
- సినిమా ఆలస్యం కావడం మహేష్ బాబుకు గ్లోబల్ గుర్తింపు తెస్తుందని అభిమానులు అంటున్నారు.
- ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి సినిమా కోసం 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారట. ఈ సినిమా ఆలస్యం కావడానికి గల కారణాలను మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి.
వారణాసి సినిమా ఆలస్యానికి కారణం ఏమిటి?
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వారణాసి(Varanasi) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మహేష్ బాబు కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే నటించారు కానీ ఈయన నటించిన సినిమాలు తెలుగు భాషకు మాత్రమే పరిమితం అయ్యాయి కానీ ఏవి కూడా ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాలేదు. మొదటిసారి రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న వారణాసి సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడవ తేదీ విడుదల కాబోతున్నట్టు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు.
ఇక ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో ఒక షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఇంటర్నేషనల్ మీడియాతో కలిసి పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు వారణాసి సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ తాను రాజమౌళితో కలిసి వారణాసి సినిమా గత 15 సంవత్సరాల క్రితమే చేయాల్సి ఉందని తెలియజేశారు.
మహేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతోంది?
వారణాసి సినిమా కోసం 15 సంవత్సరాల క్రితం తాను రాజమౌళిని కలిశాను. అయితే ఆ సమయంలో రాజమౌళి బాహుబలి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. బాహుబలి రెండు భాగాలు పూర్తి అయిన తరువాత వారణాసి సినిమా చేస్తానని తెలిపారు. కానీ తిరిగి రాజమౌళి RRR సినిమాను మొదలు పెట్టారని ఆ తరువాత కోవిడ్ కారణంగా వారణాసి సినిమా రావడానికి 15 సంవత్సరాలు పట్టింది అంటూ మహేష్ బాబు తెలియజేశారు. ఇలా ఈ అడ్డంకులు లేకపోతే వారణాసి సినిమా గత 15 సంవత్సరాల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చేదని తెలుస్తోంది.
ఆలస్యం అవ్వటమే మంచిదైందా..
సినిమా ఆలస్యం అవ్వడం మంచిదేనా?
ఈ సినిమా గురించి మహేష్ బాబు చేసిన కామెంట్లపై ఆయన అభిమానులు స్పందిస్తూ.. ఒకవేళ 15 సంవత్సరాల క్రితమే ఈ సినిమా వచ్చి ఉంటే కనుక ఇంత పెద్ద క్రేజ్ ఉండేది కాదని, అప్పుడు కూడా ఈ సినిమా ఒక తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యేది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఈ సినిమా ఆలస్యం కావడం వల్లే మహేష్ బాబు గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఒకరకంగా ఈ సినిమా ఆలస్యం అవ్వడమే మంచిదైదని మహేష్ బాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నట్టు ఇదివరకే ఈయన పాత్రను పరిచయం చేశారు. అలాగే ఇందులో రాముడిగా మహేష్ బాబు కనిపించబోతున్నారని ఈ పాత్ర దాదాపు 25 నిమిషాల పాటు ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో విలన్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ద్వారా రాజమౌళి గ్లోబల్ రేంజ్ లో ఎలాంటి సక్సెస్ అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికి వారణాసి సినిమా ఆలస్యమైనప్పటికీ, ఇది మహేష్ బాబు కెరీర్‌కు ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. గ్లోబల్ స్థాయిలో ఆయనకు గుర్తింపు తెస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.


