|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేష్‌ బాబు `1 నేనొక్కడినే` ఫెయిల్యూర్‌కి కారణం ఇదే, తప్పు జరిగింది ఇక్కడే

Updated: 30-11-2025, 12:25 AM
  • `1 నేనొక్కడినే` ఫెయిల్యూర్‌పై నిర్మాత రామ్ ఆచంట స్పందించారు.
  • టీజర్, ట్రైలర్లలో కథను దాచిపెట్టడమే ప్రధాన లోపమని ఆయన తెలిపారు.
  • సినిమా పరాజయంతో మహేష్ బాబు తీవ్రంగా బాధపడ్డారని అనిల్ సుంకర చెప్పారు.
  • ఈ సినిమాతో కృతి సనన్ టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన `1 నేనొక్కడినే` సినిమా పరాజయంపై నిర్మాత రామ్ ఆచంట కీలక విషయాలు వెల్లడించారు. టీజర్‌, ట్రైలర్లలో జరిగిన తప్పుల వల్లే సినిమా అంచనాలను అందుకోలేకపోయిందని ఆయన తెలిపారు. ఈ సినిమా ఫెయిల్యూర్‌కు గల అసలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

`1 నేనొక్కడినే` పరాజయానికి అసలు కారణం

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు `శ్రీమంతుడు` సినిమాకి ముందు పలు పరాజయాలు ఫేస్‌ చేశారు. కానీ ఆ తర్వాత చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే స్టయిలీష్‌ ఫిల్మ్ గా, హైలీ స్టాండర్డ్‌ ఉన్న ఫిల్మ్ గా భావించారు. హాలీవుడ్‌ టేకింగ్‌ అన్నారు. సుకుమార్‌ రూపొందించిన ఈ చిత్రం 2014లో విడుదలైంది. ఆడియెన్స్ ని డిజప్పాయింట్‌ చేసింది. దీంతో ఓవరాల్‌గా డిజాస్టర్‌గా నిలిచిందీ మూవీ. 14 రిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర కలిసి నిర్మించారు.

తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై నిర్మాతల్లో ఒకరైన రామ్‌ ఆచంట స్పందించారు. మహేష్‌ `వన్‌ నేనొక్కడినే` ఎందుకు ఆడలేదో ఆయన ఎనలైజ్‌ చేశారు. వాళ్లు ఎక్కడ మిస్టేక్ చేశారో తెలిపారు. ఈ సినిమా కథ వేరే, తీసిన విధానం వేరు, కానీ ఆ విషయాన్ని ఆడియెన్స్ కి చెప్పలేకపోయామన్నారు. టీజర్‌, ట్రైలర్లలో అసలు విషయాన్ని దాచడమే మిస్టేక్‌ అయ్యిందని, ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేసేలా సినిమా లేకపోవడంతో వాళ్లంతా నిరాశ చెందారు. టీజర్‌, ట్రైలర్లలో కంటెంట్ గురించి చెప్పి ఉంటే బాగుండేది, ఆ విషయంలో తాము ఫెయి‌ల్‌ అయినట్టు చెప్పారు రామ్‌ ఆచంట.

టీజర్, ట్రైలర్లలో జరిగిన తప్పులు

ఈ రోజు రిలీజ్‌ చేసినా ఈ మూవీ ఆడదన్నారు. దీన్ని అంతా హాలీవుడ్‌ స్టయిల్‌ సినిమా, జేమ్స్ బాండ్‌ తరహా సిరీస్‌గా ఉంటుందని టీమ్‌ అంతా సినిమా మేకింగ్‌లో బిజీగా ఉన్నారు. కానీ టీజర్‌, ట్రైలర్ల ద్వారా ఎలాంటి సినిమా తీశామనేది అంచనాలను ఆడియెన్స్ లో సెట్‌ చేయలేకపోయామన్నారు నిర్మాత. అందుకే సినిమా ఆడలేదని, సినిమా ఏంటో చెప్పి ఉంటే బాగుండేదన్నారు. అయితే సినిమా మూడు నెలల ముందే తమకు  ఇది వర్కౌట్‌ కాదని తెలిసిందని మరో నిర్మాత అనిల్‌ సుంకర కూడా గతంలో  చెప్పారు. తాను అంచనా వేసిందే నిజమైందని, కాకపోతే ఈ ఫెయిల్యూర్‌ని మహేష్‌ బాబు తీసుకోలేకపోయారని, ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు, డే అండ్‌ నైట్‌ వర్క్ చేశారు. దీంతో సినిమా బాగా లేదనే టాక్‌తో మహేష్‌ చాలా బాధపడ్డారని తెలిపారు అనిల్‌ సుంకర. మహేష్‌ బాబుని ఇలాంటి ఒక లోపం ఉన్న వ్యక్తిలా చూపిస్తే అభిమానులు తీసుకులేరని తెలిపారు. వారంతా డిజప్పాయింట్‌ కావడానికి ఈ కంటెంటే కారణమన్నారు.

సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంతో కృతి సనన్‌ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆమెకిది తొలి తెలుగు సినిమా. హీరోయిన్‌గానూ ఫస్ట్ మూవీనే కావడం విశేషం. ఈ మూవీ ఆడకపోవడంతో ఆమె బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మహేష్‌ బాబు తనయుడు గౌతమ్‌ బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఆ తర్వాత మళ్లీ సుకుమార్‌, మహేష్‌ కాంబినేషన్‌లో సినిమా రాలేదు. అయితే `పుష్ప` కథని మొదట మహేష్‌కే చెప్పారట సుకుమార్‌. కానీ దీనికి తాను సూట్‌ కానని చెప్పి మహేష్‌ రిజెక్ట్ చేశారట. దీంతో అల్లు అర్జున్‌ వద్దకు వెళ్లింది. ఆయన ఏకంగా ఇండియన్‌ సినిమానే షేక్‌ చేశారు.

మహేష్ బాబు బాధ, కృతి సనన్ పరిచయం

ఇక ప్రస్తుతం మహేష్‌ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. రామాయణం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు ఇప్పటికే రాజమౌళి తెలిపారు. ఆ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ లోనూ ఆ విషయాన్ని స్పష్టంచేశారు. ఇందులో మహేష్‌ ప్రపంచ సాహసికుడిగా కనిపించబోతున్నారు. కాకపోతే ఆయన ఇప్పుడు కాదు, గతంలోకి వెళ్లబోతున్నారు. మైథలాజికల్‌ టైమ్‌ ట్రావెల్ కథతో ఈ సినిమా సాగుతుందని చెప్పారు. టైటిల్‌ ట్రైలర్‌లోనూ అదే చూపించారు. దాదాపు నాలుగైదు కాలాల్లో సినిమా సాగుతుందని చూపించారు. దీంతో సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది. ఈ చిత్రం 2027 సమ్మర్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

మొత్తం మీద, `1 నేనొక్కడినే` సినిమా అంచనాలను సరిగా సెట్ చేయకపోవడం, మహేష్ బాబు పడిన కష్టానికి తగిన ఫలితం లభించకపోవడం వంటివి ఈ పరాజయానికి కారణాలుగా నిలిచాయి. నిర్మాత మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.