|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేష్‌ `ఖలేజా` సరికొత్త రికార్డు..`గబ్బర్‌ సింగ్‌` రికార్డులు బ్రేక్‌.. ఫస్ట్ డే కలెక్షన్లు

Published: 31-05-2025, 10:51 AM

టాలీవుడ్ లో రీ-రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మహేష్ బాబు `ఖలేజా` సినిమా రీ-రిలీజ్ అయి రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. గబ్బర్ సింగ్ రికార్డును బ్రేక్ చేసింది.

Key Points

1

మహేష్ బాబు `ఖలేజా` రీ-రిలీజ్ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది.

2

ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు రూ.8.26 కోట్లు, గబ్బర్ సింగ్ రికార్డును బ్రేక్ చేసింది.

4

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్, అనుష్క జంటగా నటించారు.

`ఖలేజా` రీ-రిలీజ్‌ విజయం

టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో వరుసగా క్లాసిక్‌ మూవీస్‌ ని, బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో రీ రిలీజ్‌లో స్టార్‌ హీరోల సినిమాలు రచ్చ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహేష్‌ బాబు `ఖలేజా` మూవీ సరికొత్త రికార్డుని  క్రియేట్‌ చేసింది.

సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మహేష్‌ బాబు నటించిన `ఖలేజా` చిత్రాన్ని రీ రిలీజ్‌ చేశారు. 4కే రిజల్యూషన్‌తో ఈ మూవీని శుక్రవారం ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు.

అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు క్రియేట్‌ చేసిన ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల పరంగానూ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. రీ రిలీజ్‌ మూవీస్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.

మహేష్‌ బాబు `ఖలేజా` మూవీ మొదటి రోజు ఏకంగా రూ.8.26 కోట్ల గ్రాస్‌ని రాబట్టడం విశేషం. దీంతో ఈ మూవీ రీరిలీజ్‌ సినిమాలకు సంబంధించిన అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది. గతంలో రూ.6.75 కోట్లతో పవన్‌ కళ్యాణ్‌ `గబ్బర్‌ సింగ్‌` మూవీ టాప్‌లో ఉంది.

రికార్డు స్థాయి కలెక్షన్లు

ఇప్పటి వరకు రీ రిలీజ్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా `గబ్బర్ సింగ్‌` నిలిచింది. ఆ రికార్డులను ఇప్పుడు మహేష్‌ బాబు `ఖలేజా` బ్రేక్‌ చేయడం విశేషం.

ఇదిలా ఉంటే `ఖలేజా` మూవీ 2010లో విడుదలైంది. స్ట్రెయిట్ రిలీజ్‌ టైమ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విమర్శల ప్రశంసలందుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

కానీ ఇప్పుడు స్ట్రెయిట్‌ రిలీజ్‌ కంటే రీ రిలీజ్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టడం విశేషం. ఈ మూవీ శనివారం, ఆదివారం కూడా బాగానే రన్‌ అయ్యే అవకాశం ఉంది.

`గబ్బర్ సింగ్` రికార్డును బ్రేక్ చేసింది

ఈ లెక్కన ఇది సుమారు పదిహేను కోట్లకు పైగా వసూళ్లని రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమాని కొన్న నిర్మాతకి కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇక మహేష్‌ బాబు, అనుష్క శెట్టి జంటగా నటించిన `ఖలేజా` చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకుడు. `అతడు` సినిమా తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రమిది.

ఈ మూవీని సింగనమల రమేష్‌ బాబు, సీ కళ్యాణ్‌, ఎస్‌ సత్యరామమూర్తి నిర్మించారు. రూ.32 కోట్లకు రూపొందిన ఈ మూవీ రూ.18కోట్లు వసూలు చేసింది. సగం నష్టాలను తెచ్చిపెట్టింది. కానీ ఇప్పుడు ఆరేడు రెట్లు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

మొత్తం మీద, `ఖలేజా` రీ-రిలీజ్ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది. ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను అందించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.