|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజమౌళి-మహేష్ బాబు ‘వారణాసి’కి షాకింగ్ ట్విస్ట్! ‘రఫ్’ డైరెక్టర్ త్యాగం.. టాలీవుడ్ సంచలనం!

Published: 23-07-2026, 7:05 AM

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమాపై నెలకొన్న ఆసక్తికర టైటిల్ వివాదానికి తెరపడింది. ఊహించని మలుపులతో ఈ సమస్య ఎలా పరిష్కారమైందో, ఓ దర్శకుడు చేసిన గొప్ప త్యాగం ఏంటో తెలుసుకుందాం!

Key Points

1

రాజమౌళి, మహేష్ బాబు 'వారణాసి' సినిమా టైటిల్ సమస్యకు శుభం కార్డు పడింది.

2

'రఫ్' డైరెక్టర్ సీహెచ్ సుబ్బారెడ్డి 'వారణాసి' టైటిల్‌ను స్వచ్ఛందంగా వదులుకున్నారు.

4

వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

వారణాసి టైటిల్ వివాదం: తెరవెనుక అసలేం జరిగింది?

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యావత్ సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాకపోతే ‘వారణాసి’ అనే టైటిల్ ను ఆల్రెడీ వేరే సినిమా కోసం రిజిస్టర్ చేయించారు. దీంతో రాజమౌళి – మహేష్ మూవీకి ఇబ్బందులు తప్పవని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఎలాంటి వివాదం లేకుండా ఈ సమస్య పరిష్కారమైంది. ‘వారణాసి’ సినిమా టైటిల్‌ను సీహెచ్ సుబ్బారెడ్డి అనే దర్శకుడు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఆయన గతంలో ఆది సాయికుమార్, రకుల్ ప్రీత్ సింగ్ లతో ‘రఫ్’ సినిమా తెరకెక్కించారు. గతేడాది నవంబర్ లో రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్‌‌లో సినిమాని అధికారికంగా ప్రకటించారు. సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలియజేస్తూ, పక్కా మాస్ కమర్షియల్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రాజమౌళి – మహేశ్ బాబు మూవీకి ‘వారణాసి’ అనే టైటిల్ పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్న టైంలో, అదే పేరుతో సినిమాని అనౌన్స్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే రాజమౌళి మూవీ కోసం తన టైటిల్ ను ఇవ్వడానికి సుబ్బారెడ్డి ముందుకొచ్చారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా ‘వారణాసి’ టైటిల్ ను ఇస్తున్నట్లు దర్శకుడు సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, సుబ్బారెడ్డి కలిసి తాజాగా నిర్మాత కేఎల్ నారాయణను మీట్ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు. 2023లో ‘వారణాసి’ టైటిల్‌ను తన బ్యానర్‌పై రిజిస్టర్ చేసుకుని, కథపై పని ప్రారంభించానని సుబ్బారెడ్డి తెలిపారు. అయితే అదే టైటిల్ రాజమౌళి మూవీ కోసం అవసరమైందని తెలిసిన తర్వాత, తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తన అభిమాన హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ కలిసి చేస్తున్న భారీ చిత్రానికి టైటిల్ ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని సుబ్బారెడ్డి అన్నారు. టైటిల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారంగా చూడలేదని, ఒక్క రూపాయి కూడా తీసుకోవాలనే ఆలోచన తనకు రాలేదని సుబ్బారెడ్డి తెలిపారు . ‘వారణాసి’ టైటిల్ తనకి ఒక ఎమోషన్ అని, దాన్ని అమ్మడానికి కాకుండా మంచి సినిమా కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గేయరచయిత చంద్రబోస్‌లకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వారణాసి’ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ‘వారణాసి’ టైటిల్‌పై సుబ్బారెడ్డి ఎంతో భావోద్వేగంతో ఉన్నారని, అందుకే వెంటనే మాట్లాడలేదని దర్శకుడు వీరశంకర్ తెలిపారు. రాజమౌళి, కేఎల్ నారాయణ వంటి ప్రముఖులు రూపొందిస్తున్న సినిమా కోసం టైటిల్ ఇస్తే ఇండస్ట్రీకి మంచి సందేశం వెళ్తుందని వివరించగా, సుబ్బారెడ్డి వెంటనే అంగీకరించారని చెప్పారు. టైటిళ్లను డబ్బు కోసం కాకుండా, పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరస్పరం సహకరించుకోవాలని అభిప్రాయపడ్డారు. సుబ్బారెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్‌లో ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణానికి మార్గదర్శకంగా నిలుస్తుందని వీరశంకర్ ప్రశంసించారు. ‘వారణాసి’ చిత్రంలో రుద్ర పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నారు. కుంభగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, మందాకినిగా ప్రియాంకా చోప్రా కనిపించనున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ పై అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాని గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

రాజమౌళి-మహేష్ కోసం ‘రఫ్’ డైరెక్టర్ గొప్ప త్యాగం!

ఎలాంటి ప్రతిఫలం లేకుండా టైటిల్ వదులుకున్న వైనం!

‘వారణాసి’ సినిమాపై మరింత ఉత్కంఠ పెంచుతూ ఈ టైటిల్ వివాదం ముగిసింది. రాజమౌళి, మహేష్ బాబు కాంబోపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.