|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ సినిమాతో జీవితం ధన్యం! మహేష్ కన్నీళ్లు.. వైరల్ అవుతున్న కామెంట్స్

Published: 28-12-2025, 9:12 AM
ప్రభాస్ సినిమాతో జీవితం ధన్యం! మహేష్ కన్నీళ్లు.. వైరల్ అవుతున్న కామెంట్స్
  • ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఖైతలపూర్ గ్రౌండ్స్‌లో జరిగింది.
  • కమెడియన్ మహేష్ అచంట వేదికపై భావోద్వేగానికి లోనై ప్రసంగించారు.
  • ప్రభాస్, మారుతి, నిర్మాతలకు జీవితాంతం రుణపడి ఉంటానని మహేష్ తెలిపారు.
  • పాన్ ఇండియా సినిమాలో ఒక్క షాట్‌లో కనిపించినా జన్మ ధన్యమని మహేష్ ఆనందం వ్యక్తం చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమెడియన్ మహేష్ అచంట భావోద్వేగ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభాస్, మారుతి, నిర్మాతలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. పాన్ ఇండియా సినిమాలో అవకాశం లభించడం అదృష్టమని అన్నారు.

‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), స్టార్ డైరెక్టర్ మారుతి(Maruti) కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab). నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మహేష్ అచంట భావోద్వేగ ప్రసంగం

ఇక పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించిన ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఖైతలపూర్ గ్రౌండ్స్‌లో ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ నిర్వహించింది. ఇక ఈ ఈవెంట్‌లో కమెడియన్ మహేష్ అచంట ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అంతా మంచి జరగాలి. 2026లో మనం కనిపించబోయే ఫస్ట్ సినిమా ప్రభాస్ అన్నది.

వైరల్ అవుతున్న మహేష్ కామెంట్స్ వెనుక అసలు కారణం

మారుతి సార్ నాకు ఇందులో కనిపించే అవకాశం ఇచ్చారు, ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇచ్చారు, ప్రభాస్ అన్న టీ షర్ట్ ఇచ్చారు. వీళ్ల ముగ్గురికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ సినిమాలో మనం ఒక్క షార్టులో కనిపించినా మన జన్మ ధన్యం. ఆ చాన్స్ నాకు వచ్చింది.. అందుకే ఈ ముగ్గురికి రుణపడి ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మహేష్ చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు పెద్ద సినిమాల్లో అవకాశాల విలువను చాటిచెబుతున్నాయి. ఆయన పలికిన కృతజ్ఞతా భావం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.