|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘స్విమ్మింగ్ రాకున్నా ఓ సన్నివేశం కోసం వాటర్‌లో దూకాను’.. ఓ భామ అయ్యో రామ బ్యూటీ సంచలన కామెంట్స్

Published: 07-07-2025, 11:48 PM

తెలుగు సినిమా నటి మాళవిక మనోజ్ తన తాజా చిత్రం ‘భామ అయ్యో రామ’ గురించి మాట్లాడుతూ, ఈత రాకుండానే ఓ సన్నివేశం కోసం నీటిలో దూకినట్లు వెల్లడించారు. సినిమాలో తన పాత్ర, మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Key Points

1

మాళవిక మనోజ్ 'భామ అయ్యో రామ' సినిమాలో నటిస్తున్నారు.

2

ఈత రాకున్నా సినిమా కోసం వాటర్ సీన్ లో నటించారు.

4

గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మాళవిక మనోజ్ ‘భామ అయ్యో రామ’ సినిమా గురించి

సినీ ఇండస్ట్రీలో అతితక్కువ సమయంలో మంచి గుర్తింపు దక్కించుకున్న నటి మాళవిక మనోజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ చిన్న చిన్న సినిమాల్లో అవకాశం సంపాదించుకున్నప్పటికీ.. ఆ మూవీస్ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సొంతం చేసుకుంటున్నాయి. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ప్రకాశన్ పరకట్టే, నాయాది, జో, ఆనంద్ శ్రీబాల వంటి సినిమాల్లో నటించి జనాల మెప్పు పొందింది. అయితే మాళవిక తాజాగా ఓ భామ అయ్యో రామతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నెల (జులై)11 వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో నటి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వాటర్ సీన్ షూటింగ్ అనుభవం

ఈ మూవీలో నా పాత్ర నా రియల్ లైఫ్‌కు చాలా దూరంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. తెలుగులో ఇదే తొలి మూవీ అని, మొదటిదే ఇలాంటి మూవీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. చాలా అదృష్టంగా భావిస్తున్నానని.. ఈ మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్‌, ప్రేమతో పాటు చాలా కోణాలున్నాయని పేర్కొంది. ఈ చిత్రంలో సత్యభామ అనే మోడ్రన్ గర్ల్‌గా కనిపిస్తానని వెల్లడించింది.

సినిమా ఎంపిక మరియు గ్లామర్ పాత్రలు

కానీ ఈ చిత్రంలో వాటర్‌లో స్విమ్మింగ్ చేసే ఓ సన్నివేశం ఉందని తెలిపింది. నాకు ఈత రాకున్నా భయపడుతూనే వాటర్‌లోకి దూకి స్విమ్ చేశానని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాల ఎంపిక విషయం కూడా చెప్పుకొచ్చింది. స్టోరీ నచ్చితే గ్లామర్ పాత్రలు చేయడానికి అయినా రెడీ అని తెలిపింది. ఎప్పుడు రొటీన్ రోల్స్‌లో కనిపిస్తే జనాలకే కాదు.. నాకు కూడా బోరింగ్ ఉందని.. కాగా సవాల్ విసిరే పాత్రల్లో నటించాలని ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

మాళవిక మనోజ్ ‘భామ అయ్యో రామ’ సినిమాలో తన పాత్ర, సినిమా షూటింగ్ అనుభవం గురించి పంచుకున్నారు. ఆమె తెలుగు సినిమా ప్రేమికులను ఆకట్టుకునేలా మరిన్ని సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.