|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఛాన్సుల కోసమే అలాంటి పని చేయడం లేదు: నటి మాళవిక మీనన్

Published: 02-06-2025, 5:58 AM
ఛాన్సుల కోసమే అలాంటి పని చేయడం లేదు: నటి మాళవిక మీనన్

తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల నటి మాళవిక మీనన్ తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై, అలా చేయడానికి కారణం అవకాశాల కోసమేనా అనే ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఆమె స్పష్టత ఏమిటో తెలుసుకుందాం.

Key Points

1

మాళవిక మీనన్ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

2

అవకాశాల కోసం గ్లామర్‌గా మారడం లేదని ఆమె స్పష్టం చేశారు.

4

ఫేక్ అకౌంట్ల ద్వారా వచ్చే అవాస్తవ ప్రచారాలను పట్టించుకోనని ఆమె తెలిపారు.

మాళవిక మీనన్ సోషల్ మీడియా యాక్టివిటీ

వెండితెరపై గ్లామర్‌గా నటించడం తప్పా అని చాలా మంది కథానాయికలు ప్రశ్నించారనే విషయం తెలిసిందే. ఇప్పుడు మలయాళ నటి ‘మాళవిక మీనన్‌'(Malavika Menon) కూడా అదే అడుగుతోంది. తమిళ, మలయాళ చిత్రాల్లో ఈ కేరళా కుట్టికి భారీగానే అభిమానులు ఉన్నారు. దీంతో మాతృభాషలో నటిస్తూనే కోలీవుడ్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తెలుగులో కూడా ‘అమ్మాయిలు అంటే అదో రకం, వందనం’ అనే రెండు చిత్రాలతో తన లక్‌ను చూసుకుంది. కానీ, ఇక్కడ అనుకున్నంతగా ఛాన్సులు రాలేదు. కానీ, మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఈసారి గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

గ్లామర్ పాత్రలపై ఆమె అభిప్రాయం

ఇప్పటికే ఈ అమ్మడు తమిళంలో ఇవన్‌ వేర మాదిరి, విళా, బ్రహ్మన్‌, వెత్తువెట్టు, నిజమానిళలా వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అయితే ఈ బ్యూటీ చిత్రాలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ కుర్రక్రారును ఆకట్టుకుంటుంది. దీంతో చిత్రాల్లో పక్కింటి అమ్మాయిగా కనిపించే మాళవిక మీనన్‌ గ్లామర్‌గా మారడానికి కారణం అవకాశాల కోసమా? అనే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారని పేర్కొంది. అయితే అలాంటిదేమీ లేదని చెప్పింది.

అవాస్తవ ప్రచారాలపై స్పందన

అయినా గ్లామర్‌గా నటించడంలో తప్పేంటి అని ప్రశ్నించింది. మలయాళ చిత్రాల్లో గ్లామర్‌గా నటించే అవకాశం ఉండదని, తమిళం, తెలుగు భాషా చిత్రాల్లో అలా నటించవచ్చునని పేర్కొంది. అయినా సామాజిక మాధ్యమాల్లో తన గ్లామరస్‌ ఫొటోల గురించి అడుగుతున్నారని, తాను మాత్రమే అలా చేస్తున్నానా అని ప్రశ్నించింది. అయినా ఫేక్‌ అకౌంట్లతో అవాస్తవాలు రాస్తూ ముఖం చూపడానికి భయపడే వారు సామాజిక మాధ్యమాల్లో తన గురించి ఉన్నవి, లేనివి ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటి గురించి పట్టించుకోవలసిన అవసరం లేదనే అభిప్రాయాన్ని మాళవిక వ్యక్తం చేసింది.

చివరగా, మాళవిక మీనన్ తన గ్లామర్ రోల్స్, సోషల్ మీడియా ప్రెజెన్స్ గురించి తన స్పష్టతను వెల్లడించింది. అవకాశాల కోసం కాదని, తనకు నచ్చినట్లుగా నటిస్తున్నానని తెలిపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.