
మలయాళ నటి మాళవిక మీనన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గ్లామర్ ఫోటోలపై స్పందించింది. సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న ప్రచారాలను పట్టించుకోనని చెప్పింది.
Key Points
మాళవిక మీనన్ గ్లామర్ ఫోటోలు షేర్ చేయడంపై స్పందించింది.
అవకాశాల కోసం కాదు, సొంత ఇష్టంతో ఫోటోలు పోస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.
సోషల్ మీడియాలోని తప్పుడు ప్రచారాలను పట్టించుకోనని అన్నారు.
నాలా చాలామంది హీరోయిన్లు గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.
మాళవిక మీనన్ షాకింగ్ కామెంట్స్
మలయాళ కుట్టి మాళవిక మీనన్(Malavika Menon) తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. కోలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటున్న ఈ భామ ఫుల్ ఫామ్‌లో ఉంది. మాళవిక తెలుగులోనూ ‘అమ్మాయిలు అంతే అదో టైపు(Ammailu Anthe Ado Type) , వందనం(vandanam) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ పెద్దగా ఫేమ్ రాకపోవడంతో మళ్ళీ మలయాళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. అలాగే తెలుగులోనూ చాన్సుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పలు గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈనేపథ్యంలోనే మాళవిక అవకాశాల కోసం బాడీ చూపించుకుంటుందని పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా మారడానికి కారణం అదేగా అని పదే పదే ఆమెను ప్రశ్నిస్తున్నారు.
గ్లామర్ ఫోటోలు, అవకాశాలు: నిజం ఏమిటి?
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక ఈ విషయంపై స్పందించింది. ‘‘అవకాశాల కోసం నేను నా ఫొటోలు షేర్ చేయడం లేదు. అయినా గ్లామర్‌గా నటించడంలో తప్పేంటి. మలయాళ చిత్రాల్లో అలా నటించే అవకాశం ఉండదు. కానీ తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్ పాత్రల్లో నటించవచ్చు. అయినా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో అవాస్తవాలు రాస్తూ ముఖం చూపడానికి భయపడే వారు నా గురించి ఉన్నవి లేనివి ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాటి గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా నేను ఒక్కదాన్నే గ్లామర్ ఫొటోలు షేర్ చేసి ఎక్స్‌పోజ్ చేయడం లేదు.. నాలా చాలామంది హీరోయిన్స్ చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా ప్రచారంపై స్పందన
A post shared by Malavika C Menon (@malavikacmenon)
చివరగా, మాళవిక మీనన్ తన గ్లామర్ ఫోటోలు, సోషల్ మీడియా ప్రచారంపై స్పష్టతనిచ్చింది. అవకాశాల కోసం కాదని, తనలాగే ఇతర హీరోయిన్లు కూడా అలా చేస్తున్నారని తెలిపింది.
