|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి మలయాళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్- పూలతో క్రైమ్ బిజినెస్- లేడి విలన్‌గా పరదా హీరోయిన్- తెలుగులోనూ స్ట్రీమింగ్

Published: 22-08-2025, 1:41 AM
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్- పూలతో క్రైమ్ బిజినెస్- లేడి విలన్‌గా పరదా హీరోయిన్- తెలుగులోనూ స్ట్రీమింగ్

ఓటీటీలో మలయాళ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. తాజాగా, ‘ది క్రోనికల్స్ ఆఫ్ ది ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ అనే మలయాళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో క్రైమ్, లవ్, రొమాన్స్, కామెడీ అన్నింటినీ చూడవచ్చు.

Key Points

1

మలయాళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'ది క్రోనికల్స్ ఆఫ్ ది ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్' ఓటీటీలోకి రానుంది.

2

సోనీ లివ్‌లో ఆగస్టు 29న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్.

4

యదార్థ సంఘటనల ఆధారంగా త్రివేండ్రం బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించబడింది.

‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ ఓటీటీ రిలీజ్

ఓటీటీ మలయాళ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మంచి క్రేజ్ ఉంటుంది. మలయాళం నుంచి ఎలాంటి మూవీ, వెబ్ సిరీస్ వచ్చిన మంచి బజ్ క్రియేట్ చేసుకుంటుంది. అలాగే, వాటిపై ఇండియా వైడ్ ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఓటీటీ లోకి నయా మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయా వెబ్ సిరీస్ “ది క్రోనికల్స్ ఆఫ్ ది ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్”. ఇది ఒక మలయాళ క్రైమ్ కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. తాజాగా 4.5 గ్యాంగ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో అన్ని రకాల ఎలిమెంట్స్ చూపించారు.

అది చూస్తుంటే ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్ ఓటీటీ సిరీస్‌ లో క్రైమ్, లవ్, రొమాన్స్, కామెడీ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ సిరీస్‌ను యదార్థ సంఘటనల ఆధారంగా, త్రివేండ్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ అనే టైటిల్‌ను బట్టి చూస్తేనే కథ ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది.

క్రైమ్, కామెడీ, రొమాన్స్‌తో కూడిన కథ

ఈ కథలో నలుగురు యువకులతోపాటు వయసు పెరిగిన శరీరం ఎదగని హాఫ్ మ్యాన్ ఉంటాడు. వీరంతా స్లమ్‌కు చెందిన వారు. ఈ నలుగురు, ఆ మరుగుజ్జుని కలిపి 4. గ్యాంగ్ అని పిలుస్తుంటారు. వీరితో పలుకుబడి ఉన్నవాళ్లు కావాల్సిన పనులు చేయించుకుంటారు.

ఇక ఈ ఊర్లో ఆలయ ఉత్సవం జరిపి తమ గౌరవాన్ని పెంచుకోవాలని ఈ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. మరోవైపు పూలతో ఫ్లవర్ కింగ్ అని పిలిపించుకునే వ్యక్తి క్రైమ్స్ చేస్తుంటాడని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ క్రమంలో 4.5 గ్యాంగ్‌కు ఎదురయ్యే పరిస్థితులు ఏంటి? ప్రత్యర్థుల నుంచి వచ్చే సమస్యలు ఏంటి? అక్కడి పూలు, పాల వ్యాపారాలను నియంత్రించే స్థానిక గ్యాంగ్ స్టర్‌తో ఈ గ్యాంగ్‌కు వచ్చే ప్రమాదం ఏంటి? అన్నదే ఈ సిరీస్ కథ.

లేడి విలన్‌గా దర్శన రాజేంద్రన్

ఇక ఈ సిరీస్‌లో లేడి విలన్‌గా పరదా సినిమా హీరోయిన్ దర్శన రాజేంద్రన్ చేయడం మరింత ఆసక్తిగా మారింది. దర్శన రాజేంద్రన్ మలయాళంలో పాపులర్ హీరోయిన్లలో ఒకరు. ఇకపోతే సోనీ లివ్‌లో 4.5 గ్యాంగ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అది కూడా తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్ ఓటీటీ రిలీజ్ కానుంది.

ఆగస్ట్ 29 నుంచి ది క్రోనికల్స్ ఆఫ్ ది ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్ డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు సోనీ లివ్ ఓటీటీ ప్రకటించింది. కాగా ఈ వెబ్ సిరీస్‌కు క్రిషాంద్ దర్శకత్వం వహించారు.

చివరగా, ‘ది క్రోనికల్స్ ఆఫ్ ది ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో తెలుగుతో సహా మూడు భాషల్లో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.