|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mammootty: హీరో ఇంట్లో విషాదం.. ఆయన కన్నుమూత

Updated: 14-06-2025, 8:45 AM
Mammootty: హీరో ఇంట్లో విషాదం.. ఆయన కన్నుమూత

మలయాళ చిత్ర పరిశ్రమ నటుడు మమ్ముట్టి కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మామ పీఎస్ అబు అనారోగ్యంతో మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Key Points

1

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి మామ, పీఎస్ అబు కన్నుమూశారు.

2

అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

4

మోహన్ లాల్ మేనమామ కూడా ఇటీవలే మరణించారు.

మమ్ముట్టి మామ మరణం

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇంట్లో విషాదం నెలకొంది. ఈయన మామ పీఎస్ అబు(92) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయనకు మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టి సహా నలుగురు పిల్లలు ఉన్నారు. మామ చనిపోవడంతో ప్రస్తుతం మమ్ముట్టి కుటుంబంలో శోకసంద్రంలో ఉంది.

కుటుంబంలో విషాదం

1971 సినిమాలు చేస్తున్న మమ్ముట్టి.. 300కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులోనూ ఈయనకు అభిమానులు ఉన్నారు. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో మమ్ముట్టి నుంచి భ్రమయుగం, టర్బో, బజుక తదితర మూవీస్ వచ్చాయి.

మమ్ముట్టి మామ చనిపోవడానికి సరిగ్గా ఒకరోజు ముందు ఇదే మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరో సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మేనమామ గోపీనాథ్ నాయర్ కూడా తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. తనువు చాలించారు. ఇలా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే సదరు హీరోల అభిమానులు.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

మలయాళ సినీ పరిశ్రమలో శోకం

మమ్ముట్టి మామ మరణంతో మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.