|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Breaking: ఓటీటీలో చిరు ‘మన శంకర వరప్రసాద్ గారు’.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా? రికార్డులు షురూ!

Published: 04-02-2026, 7:05 AM
Breaking: ఓటీటీలో చిరు 'మన శంకర వరప్రసాద్ గారు'.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా? రికార్డులు షురూ!
  • సంక్రాంతి బ్లాక్‌బస్టర్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది!
  • మెగాస్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్: చిరంజీవి మేనరిజమ్స్‌కి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా!
  • ఓటీటీలో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్: తెలుగుతో పాటు 7 భాషల్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సందడి చేయనున్నారు.
  • జీ5లో గ్రాండ్ రిలీజ్: థియేటర్లలో రికార్డులు కొల్లగొట్టిన చిత్రం డిజిటల్ స్క్రీన్‌పై దుమ్ము రేపడానికి సిద్ధం!

మెగా అభిమానులకు ఇది నిజంగా పండగే! చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

400 కోట్ల గ్రాస్: బాక్సాఫీస్ వద్ద మన శంకర వరప్రసాద్ గారి ప్రభంజనం

ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేవలం మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, చిరంజీవి (Chiranjeevi)కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరు మేనరిజమ్స్ తోడవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ (Venkatesh)గెస్ట్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి, కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేటర్లలో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఓటీటీపై సస్పెన్స్ నెలకొంది. డిజిటల్ హక్కులను జీ5 (ZEE5) సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించింది.

ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: జీ5లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కానీ స్ట్రీమింగ్ తేదీని మాత్రం వెల్లడించలేదు. లేదు మెగా అభిమానులు అయోమయంలో పడిపోయారు.. తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. జీ5 తన అఫీషియల్ యాప్ క్యాటలాగ్‌లో ఈ తేదీని జత చేయడంతో అభిమానుల నిరీక్షణకు తెరపడింది. థియేట్రికల్ రన్ ముగిసిన నాలుగు వారాలకే ఈ సినిమాను డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ లోకి తీసుకురావడం విశేషం. ఈ సినిమా కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో డిజిటల్ సందడి చేయనుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతోందని తెలుస్తోంది. ప్రాంతీయ భాషా చిత్రంగా విడుదలై ఇంత భారీ స్థాయిలో మల్టీ-లాంగ్వేజ్ రిలీజ్ సొంతం చేసుకోవడం మెగాస్టార్ రేంజ్‌ను మరోసారి నిరూపిస్తోంది.

7 భాషల్లో మెగా సందడి: పాన్ ఇండియా స్థాయిలో డిజిటల్ రిలీజ్!

థియేటర్లలో మిస్ అయిన వారికి మరియు మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే మెగా అభిమానులకు ఫిబ్రవరి 11న పండగే అని చెప్పాలి. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ వ్యూయర్‌షిప్ పరంగా కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. నయనతార నటన, భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఓటీటీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటాయా? లేదా చూడాలి. ఇక చిరు.. వెంకటేష్‌ను మరోసారి బిగ్‌స్క్రీన్‌పై కలిసి చూసే అవకాశం దక్కనుంది. ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని కుటుంబంతో కలిసి సినిమా చూసేయొచ్చన్నమాట.

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీలో కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతుందో లేదో చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.