|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manam Movie: సమంత-చైతూ పెళ్లి పీటలెక్కిన సినిమా.. థియేటర్లలో రిలీజ్

Published: 03-08-2025, 3:47 AM
Manam Movie: సమంత-చైతూ పెళ్లి పీటలెక్కిన సినిమా.. థియేటర్లలో రిలీజ్

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ నటించిన ‘మనం’ సినిమా జపాన్‌లో విడుదల కానుంది. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 2014లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Key Points

1

మనం సినిమా జపాన్‌లో విడుదలవుతోంది.

2

సమంత, నాగచైతన్య జంటను మళ్ళీ తెరపై చూసే అవకాశం.

4

అక్కినేని త్రితరాల నటనతో ఆకట్టుకున్న చిత్రం.

జపాన్‌లో మనం సినిమా రిలీజ్

అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ ‌ ను కవర్ చేస్తూ వచ్చిన చిత్రం మనం . ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ సైతం నటించారు . సమంత హీరోయిన్ ‌ గా మెప్పించిన ఈ సినిమా 2014 లో విడుదలై సూపర్ ‌ హిట్ ‌ గా నిలిచింది . గతేడాది పదేళ్లు పూర్తి కావడంతో ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు . దీంతో సమంత – నాగ చైతన్యను బిగ్ ‌ స్క్రీన్ ‌ పై మరోసారి చూసిన ఫ్యాన్స్ ‌ ఫుల్ ‌ ఖుషీ అయిపోయారు .

తాజాగా అభిమానులకు సామ్ – నాగ్ జంటను మళ్లీ బిగ్ ‌ స్క్రీన్ ‌ పై చూసే ‍ అవకాశం వచ్చింది . ఈ బ్లాక్ బస్టర్ ‌ మూవీని జపాన్ ‌ లో విడుదల చేయనున్నట్లు నాగచైతన్య ట్వీట్ చేశారు . నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న చిత్రం మనం .. ఈ సినిమా జపాన్ ప్రజలకు చేరువవుతుండటం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశారు. మనం ఆగస్టు 8న థియేటర్లలో విడుదల కానుందని చైతూ వెల్లడించారు . దీంతో అక్కినేని ఫ్యాన్స్ ‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు . ఆడియన్స్‌కు మరోసారి సామ్ – చైతన్యను బిగ్ ‌ స్క్రీన్ ‌ పై చూసే అవకాశం దక్కనుంది .

సమంత-చైతూ జంట మళ్ళీ తెరపై

అక్కినేని ఫ్యామిలీ నటించిన ఈ చిత్రం 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్‌ బస్టర్ ‌ హిట్‌ కావడంలో అనుప్‌ రూబెన్స్‌ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఎక్కడ చూసిన ‘మనం’ పాటలే వినిపించేవి. ఆ మెలోడీ సాంగ్స్‌ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మార్మోగిపోతూనే ఉంటాయి.

2014 సూపర్ హిట్ మూవీ రీ-రిలీజ్

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ‌ గా నటించిన సమంత – నాగ చైతన్య రియల్ ‌ లైఫ్ ‌ లోనూ పెళ్లి పీటలెక్కారు . కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు . గతేడాది డిసెంబర్ ‌ లో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు . హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు . ప్రస్తుతం సమంత ఇప్పటి వరకు సింగిల్ ‌ గానే ఉంటోంది . అయితే బాలీవుడ్ డైరెక్టర్ ‌ తో రిలేషన్ ‌ లో ఉన్నట్లు టాక్ ‌ వినిపిస్తోంది .

అక్కినేని కుటుంబం మూడు తరాల నటనతో ఆకట్టుకున్న మనం సినిమా జపాన్ ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమవుతోంది. సమంత, నాగచైతన్య జంట మరోసారి తెరపై కనిపించడం అభిమానులకు పండుగే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.