|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హిందీ రియాలిటీ షో కంటెస్టెంట్‌గా మంచు లక్ష్మి.. ఆ అవతారం ఏందో.. అ కథేందో.. తెలుగోళ్ల పరువు తీస్తుందిగా.. (VIDEO)

Published: 16-06-2025, 5:52 AM
హిందీ రియాలిటీ షో కంటెస్టెంట్‌గా మంచు లక్ష్మి.. ఆ అవతారం ఏందో.. అ కథేందో.. తెలుగోళ్ల పరువు తీస్తుందిగా.. (VIDEO)

కరణ్ జోహార్ నిర్మించిన ‘ది ట్రైటర్స్’ రియాలిటీ షోలో మంచు లక్ష్మి పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. షోలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలుగు ప్రేక్షకులను కలవరపెట్టాయి.

Key Points

1

మంచు లక్ష్మి హిందీ రియాలిటీ షోలో పాల్గొనడం

2

షోలో ఇతర కంటెస్టెంట్‌తో గొడవ

4

తెలుగు ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నారు

ది ట్రైటర్స్ షోలో మంచు లక్ష్మి

కరణ్ జోహార్ హోస్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఇండియన్ వెర్షన్ ‘ది ట్రైటర్స్’ రియాలిటీ షో పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది. హిందీ టెలివిజన్‌కు చెందిన నటీనటులు, ఉల్లు ప్లాట్ ఫామ్ బోల్డ్ స్టార్స్ ఇందులో పాల్గొంటున్నారు. అయితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఇందులో కంటెస్టెంట్‌గా కనిపించడం విశేషం. తాజాగా ఈమె ఎంట్రీకి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ కాగా అదే రోజు అపోజిట్ గ్రూప్‌కు చెందిన కంటెస్టెంట్‌తో గొడవపడింది. రామాయణంలో రాముడు.. నీటిలో చూస్తూ పైన ఉన్న చేపను విల్లుతో కొట్టాడని వాదనకు దిగింది. ఇది కాస్త వైరల్ కావడంతో పరువు పోయింది.

అసలు ఏం మాట్లాడుతుంది? ఎవరు ఈమె? అంటూ నార్త్ ఇండియన్స్ ఇందుకు సంబంధించిన క్లిపింగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మహాభారత కథను రామాయణంగా మార్చేసిందిగా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ తర్వాత ఆమె సారీ చెప్పిందని.. నాన్న చూస్తే తిడుతాడని కూడా బాధపడిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ తెలుగోళ్లు మాత్రం ఆ అవతారం ఏంది? ఆ కథేంది? పరువు తీస్తుంది? అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఈ విధంగానైనా పాపులారిటీ వస్తుందేమో చూడాలి అని కామెంట్ చేస్తున్నారు.

ఇతర కంటెస్టెంట్ తో గొడవ

వైరల్ అవుతున్న వివాదం

మంచు లక్ష్మి హిందీ రియాలిటీ షోలో తన ప్రవర్తనతో విమర్శల పాలైంది. ఈ ఘటన తెలుగు ప్రేక్షకులలో విభిన్న అభిప్రాయాలకు దారితీసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.