|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంచు మనోజ్ సంచలన రీ-ఎంట్రీ: ‘డేవిడ్ రెడ్డి’తో కొత్త అవతార్, సెకండ్ ఇన్నింగ్స్‌కు అదిరే ఆరంభం!

Published: 17-12-2025, 9:24 AM
మంచు మనోజ్ సంచలన రీ-ఎంట్రీ: 'డేవిడ్ రెడ్డి'తో కొత్త అవతార్, సెకండ్ ఇన్నింగ్స్‌కు అదిరే ఆరంభం!
  • మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇస్తున్నాడు.
  • చిత్ర గ్లిమ్స్ మంచు మనోజ్ కొత్త అవతార్‌ను, పవర్ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్‌ను సూచిస్తుంది.
  • ‘డేవిడ్ రెడ్డి’ పాత్ర స్వాతంత్య్రం కోసం పోరాడే వ్యక్తిగా రూపొందించబడింది.
  • ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది; మనోజ్ లుక్స్ కోసం కష్టపడ్డాడు.

చాలా కాలం తర్వాత మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవలే విడుదలైన గ్లిమ్స్ వీడియో అభిమానులను ఆకట్టుకుంది. పవర్ఫుల్ క్యారెక్టర్, డిఫరెంట్ లుక్స్‌తో మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ అదరగొట్టడం ఖాయం అని గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది.

మనోజ్ గత కెరీర్, కం బ్యాక్‌కు కారణం

David Reddy : మంచు మోహన్ బాబు ఫ్యామిలీ లో అందరి కంటే కూడా మంచు మనోజ్ మీద ప్రేక్షకులకు కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో మంచు మనోజ్ సినిమాలు చేయడం తగ్గించేసాడు కానీ ఒకప్పుడు మనోజ్ సినిమాలు కొంతమేరకు ప్రత్యేకంగా ఉండేవి. మనోజ్ కెరియర్ లోనే కొన్ని స్పెషల్ సినిమాలు చేశాడు. ఇప్పటికీ కూడా కొన్ని కాన్సెప్ట్ బేస్ సినిమాలు ఎంచుకునే విషయంలో మనోజ్ ని పొగడక తప్పదు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మనోజ్ నటించిన వేదం సినిమా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. అలానే అతను నటించిన ప్రయాణం, నేను మీకు తెలుసా, మిస్టర్ నూకయ్య వంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు కొంత మేరకు ప్రత్యేకం. ఇక రీసెంట్ టైమ్స్ లో మంచు మనోజ్ సినిమాలు చేయడం తగ్గించిన సంగతి తెలిసిందే. మంచి కాన్సెప్ట్ బేస్ సినిమాతో కం బ్యాక్ ఇవ్వాలి అని సీరియస్ గా నిర్ణయించుకున్నాడు. మనోజ్ అందుకే డేవిడ్ రెడ్డి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.

డేవిడ్ రెడ్డి సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో చూస్తుంటే మనోజ్ అదిరిపోయే కం బ్యాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు అని అర్థమయిపోతుంది.

గ్లిమ్స్ చాలా ఆసక్తికరంగా ఉంది డేవిడ్ రాజు అనే పాత్రను డిజైన్ చేసిన విధానమే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అలానే ఆ క్యారెక్టర్ కు ఇచ్చిన ఎలివేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అన్నిటిని మించి మంచు మనోజ్ లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. లుక్స్ చూస్తుంటే ఈ సినిమా కోసం మనోజ్ బానే కష్టపడ్డాడు అని అర్థమవుతుంది.

‘డేవిడ్ రెడ్డి’ గ్లిమ్స్: కొత్త లుక్, పవర్ఫుల్ క్యారెక్టర్

ముఖ్యంగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన మిరాయి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు మనోజ్.

War Dog… Ready to Roar 🔥🔥🔥

Speed of #DavidReddy . A revolutionary tale that has become a part of me. Created something powerful with @itshanumareddy , something all of us will be proud of ❤️❤️ 🏍️ pic.twitter.com/Q9nGga1lSn

— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 17, 2025

పాన్ ఇండియా స్థాయిలో మంచు మనోజ్

ఈ సినిమాలోని డేవిడ్ రెడ్డి అనే క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే విషయం పైన మంచు మనోజ్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇండియాకి అడుక్కుంటే వచ్చేది స్వాతంత్రం కాదు కొట్టుకొని సాధించేది స్వాతంత్రం అని నమ్మే క్యారెక్టర్ డేవిడ్ రెడ్డి. ఈ సినిమాకి రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు.

రవి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కేజీఎఫ్ సినిమాతో తన స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్రెడీ చూపించాడు. ఇకపోతే ఈ సినిమాకి హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మనోజ్ కెరియర్ కి ఇది బెస్ట్ ఫిలిం అయ్యే ఛాయలు మాత్రం గ్లిమ్స్ వీడియో చూస్తే కనిపిస్తున్నాయి.

‘డేవిడ్ రెడ్డి’ గ్లిమ్స్ మంచు మనోజ్ కం బ్యాక్ పట్ల భారీ అంచనాలను పెంచింది. అతని కొత్త అవతార్, సినిమా కాన్సెప్ట్ పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా మనోజ్‌కు గొప్ప విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.