|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంచు మనోజ్ మాస్ రీఎంట్రీ.. `డేవిడ్ రెడ్డి`గా దుమ్ము రేపేందుకు రెడీ! షాకింగ్ లుక్ వైరల్

Published: 11-03-2026, 11:05 PM
మంచు మనోజ్ మాస్ రీఎంట్రీ.. `డేవిడ్ రెడ్డి`గా దుమ్ము రేపేందుకు రెడీ! షాకింగ్ లుక్ వైరల్
  • మంచు మనోజ్ రీఎంట్రీతో టాలీవుడ్‌లో సెన్సేషన్.. `డేవిడ్ రెడ్డి`గా ఊర మాస్ అవతార్!
  • విలన్‌గా మెప్పించిన మనోజ్.. ఇప్పుడు హీరోగా సత్తా చాటేందుకు రెడీ!
  • సిక్స్ ప్యాక్ బాడీ కోసం మనోజ్ కఠోర సాధన.. ఫోటోలు వైరల్!
  • `డేవిడ్ రెడ్డి` టీజర్ అంచనాలు పెంచేసింది.. మనోజ్ కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందా?

మంచు మనోజ్ మరోసారి టాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. `డేవిడ్ రెడ్డి` చిత్రంతో ఆయన ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. అభిమానులకు ఇది నిజంగా పండగే.

మళ్ళీ హీరోగా మనోజ్.. ఈసారి మామూలుగా ఉండదు!

మంచు మనోజ్‌ ఒకప్పుడు హీరోగా రాణించాడు. ప్రారంభంలో మంచి విజయాలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత సక్సెస్‌ లు రాలేదు. దీంతో కొంత కాలం గ్యాప్ తీసుకున్నాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలా అన్ని రకాలుగా గ్యాప్‌ తీసుకుని ఇటీవల మళ్ళీ కమ్‌ బ్యాక్‌ అయ్యారు. హీరోగా రీఎంట్రీకి ప్లాన్‌ చేసినా వర్కౌట్‌ కాలేదు. దీంతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. `భైరవం`లో బలమైన పాత్రలో మెరిసి మెప్పించాడు. ఇటీవల `మిరాయ్‌`లో పవర్‌ఫుల్‌ విలన్‌గా నటించి ఆకట్టుకున్నాడు.

మంచు మనోజ్‌ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. ఈ సినిమా అటు హీరో తేజ సజ్జా కంటే.. విలన్‌గా చేసిన మనోజ్‌కే ఎక్కువగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే, మనోజ్‌ ఈ సక్సెస్‌ని కరెక్ట్ గా వాడుకున్నాడు. ఇప్పుడు మళ్లీ హీరోగా అలరించేందుకు వస్తున్నారు. అయితే సింపుల్‌గా రావడం లేదు. మంచు మనోజ్‌ 2.0 అనే రేంజ్‌లో రాబోతున్నారు. ప్రస్తుతం మనోజ్‌ `డేవిడ్‌ రెడ్డి` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్‌ అదిరిపోయింది. హీరో పాత్రని పరిచయం చేస్తూ, ఏం చూపించబోతున్నారనే విషయాన్ని తెలియజేసేలా ఈ గ్లింప్స్ సాగింది. ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు, సినిమాపై అంచాలను పెంచింది.

సిక్స్ ప్యాక్‌తో మనోజ్.. `డేవిడ్ రెడ్డి` కోసం కఠోర సాధన!

ఈ క్రమంలో తాజాగా నయాలుక్‌లోకి మారిపోయారు మంచు మనోజ్‌. సరికొత్త లుక్‌లోకి ట్రాన్స్ ఫామ్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. గత మూడు వారాలుగా ఆయన జిమ్‌లో శ్రమిస్తున్నారు. వర్కౌట్‌ చేస్తూ, బాడీని మరింత ఫిట్‌గా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరికొత్త మేకోవర్‌లోకి మారిపోయారు. ఈ సందర్భంగా నయా లుక్‌లో దిగిన ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారాపంచుకున్నాడు. ఇందులో మంచు మనోజ్‌ చెబుతూ, `మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక కంఫర్ట్ విషయంలో రాజీపడేది లేదు. ఇక సాకులు చెప్పాల‌ని అనుకోవ‌టం లేదు. కేవలం కష్టం మాత్రమే, సోమవారం స్టార్ట్ చేద్దాం, అప్పుడు, ఇప్పుడు అనుకోవడం లేదు. నిజమైన యాక్షన్‌లోకి దిగాను. దానిపై వర్క్ చేస్తున్నాను` అని తెలిపారు మనోజ్‌.

ఆయన ఇంకా చెబుతూ, `యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ న‌టించ‌లేరు. ప్రతి పంచ్, దెబ్బ త‌గిలిన‌ప్పుడు ప‌డిపోవ‌టం, ప్రతి దెబ్బకు మీ బాడీ సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు` అని వెల్లడించారు. ఇకపై కేవలం లుక్ కోసం కాకుండా శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. తన లక్ష్యం “ ధృడ‌మైన‌ వ్యక్తి”లా తయారవడం అని పేర్కొన్నాడు. ఈ అప్‌డేట్‌ను “వీక్ 3” అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ చెప్పారు. చెమటలు పట్టిన దేహంతో జిమ్‌లో మంచు మనోజ్‌ దిగిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి వైరల్‌ అవుతున్నాయి.

`డేవిడ్ రెడ్డి` టీజర్ విడుదల.. అంచనాలు పెంచేసిన మనోజ్!

ఇప్పుడు మంచు మ‌నోజ్ చేస్తోన్న `డేవిడ్ రెడ్డి` మూవీ తన కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హ‌నుమ రెడ్డి యెక్కంటి తెర‌కెక్కిస్తున్నారు. న‌ల్ల‌గంగుల వెంక‌ట్ రెడ్డి, భ‌ర‌త్ మోతుకూరి నిర్మిస్తున్నారు. 1897 – 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో డేవిడ్ రెడ్డి సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను భారీ లెవల్లో నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన డేవిడ్ రెడ్డి గ్లింప్స్‌కు అన్నీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. దీంతో మ‌నోజ్ న్యూ అవ‌తార్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. `డేవిడ్ రెడ్డి` సినిమాతో బిజీగా ఉన్న మంచు మ‌నోజ్‌.. ప‌లు ఇత‌ర ప్రాజెక్ట్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

మంచు మనోజ్ సరికొత్త అవతారంలోకి మారడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.