|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manchu Vishnu: బడ్జెట్ చెప్తే ఐటీ వాళ్లు మా ఆఫీస్‌కి వస్తారు

Published: 06-06-2025, 5:15 AM
Manchu Vishnu: బడ్జెట్ చెప్తే ఐటీ వాళ్లు మా ఆఫీస్‌కి వస్తారు

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా, విష్ణు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అతని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Key Points

1

మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా బడ్జెట్ రహస్యం బయటపెట్టాడు.

2

ఈ ఏడాది విడుదలైన సినిమాల కంటే 'కన్నప్ప' బడ్జెట్ ఎక్కువ.

4

బడ్జెట్ వివరాలు చెప్పడం వల్ల ఐటీ అధికారులు ఆఫీసుకు వస్తారని విష్ణు ఆందోళన.

‘కన్నప్ప’ సినిమా బడ్జెట్ రహస్యం

మంచు విష్ణు హీరోగా నటించి, భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ‘కన్నప్ప’. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనానికి గురవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అది దొరికిందా లేదా అనేది పక్కనబెడితే విష్ణు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలోనే తెలుగులో రౌండ్ టేబుల్ పేరుతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో కన్నప్ప బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.

ఇతర సినిమాలతో పోలిక

కన్నప్ప సినిమాకు బడ్జెట్ ఎంతయిందని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. కచ్చితంగా మూడంకెల ఖర్చు అయిందని విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే రూ.100 కోట్లు అయిందా? రూ.200 కోట్లు అయిందా? అని మరోసారి అడగ్గా.. ఈ ఏడాది ఇప్పటికే రిలీజైన చిత్రాల కంటే తమ ‘కన్నప్ప’ ఎక్కువని పేర్కొన్నడు. అలానే ఈ ఏడాదిలోనే విడుదలయ్యే పవన్ కల్యాణ్ ‘ఓజీ’ కంటే తమ మూవీ బడ్జెట్ ఎక్కువని క్లారిటీ ఇచ్చాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు.. తన ఆఫీస్‌కి వస్తారు? ఎందుకు ఈ గొడవ? అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఐటీ అధికారుల ఆందోళన

కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పిన మంచు విష్ణు.. గత కొన్నేళ్లుగా ఈ మూవీపైనే ఉన్నాడు. ఇందులో మంచు విష్ణు హీరో కాగా.. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ తదితర స్టార్స్ ఇందులో నటించారు. దీంతో మూవీపై కాస్తంత బజ్ ఉంది. కానీ చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజైనప్పుడు మాత్రం కాస్త గట్టిగానే ట్రోలింగ్ వచ్చింది. కానీ తర్వాత మరో టీజర్ విడుదల చేసినప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందని చెప్పొచ్చు. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానున్న ‘కన్నప్ప’.. విష్ణు కెరీర్‌ని ఎలా మారుస్తుందో చూడాలి?

‘కన్నప్ప’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బడ్జెట్ విషయంలో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా విజయం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.