
బతుకమ్మ పండుగ వేళ, మంగ్లీ పాడిన ‘సింగిడిలో రంగులనే’ పాట 11 కోట్లకు పైగా వ్యూస్‌తో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ పాట లిరిక్స్, పండుగ వైభవం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Key Points
మంగ్లీ బతుకమ్మ పాట 11 కోట్ల వ్యూస్‌తో సూపర్ హిట్!
‘సింగిడిలో రంగులనే’ పాట లిరిక్స్ ఇక్కడే!
ఎనిమిదేళ్ల క్రితం విడుదలైనప్పటికీ, ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది.
ఆడపడుచులందరూ ఈ పాట పాడండి!
మంగ్లీ బతుకమ్మ పాట వైరల్
పూల పండుగ బతుకమ్మ వచ్చేసింది. ప్రకృతిని పూజించే మన పండుగ వచ్చేసింది. బతుకమ్మ 2025 సంబరాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. బతుకమ్మ పాటలతో ఊరువాడ మార్మోగుతున్నాయి. మరి ఈ పండుగ సమయంలో మీరూ బతుకమ్మ పాట పాటేయండి.
బతుకమ్మ పాటలు అంటే ఇప్పుడు మంగ్లీ పేరు ముందుగా వినిపించడం ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఏడాది బతుకమ్మ కు మంగ్లీ ఓ పాట రిలీజ్ చేస్తుంది. కానీ ఎనిమిదేళ్ల క్రితం రిలీజ్ చేసిన బతుకమ్మ పాట మాత్రం చాలా స్పెషల్. సింగిడిలో రంగులనే అంటూ సాగే ఆ పాట చిరస్థాయిగా నిలిచిపోయేదే. ఇప్పటికీ ఆ సాంగ్ మార్మోగుతూనే ఉంది. ట్రెండింగ్ లో ఉండే ఆ పాట లిరిక్స్ మీకోసం.
ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి
తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి
పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి…
బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి…
బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి
ఆడబిడ్డల అరచేతులనే ఊయల కట్టి
వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకువచ్చి…
పువ్వులనే పూజించే పండుగ తెచ్చె
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
సింగిడిలో రంగులనే లిరిక్స్
పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి
రేలారే రేలారే రేల రేల రేల రేల
పత్తి పువ్వులు నీ.. పెదవుల నవ్వులుగా
గునుగు పువ్వులు నీ.. గుండె సవ్వడిగా
కంది పువ్వులనే కంటి పాపలుగా..
సీతా జడపూలే నీలో సిగ్గులుగా..
తీరొక్క పూలు చేరి.. నీ చీరలాగ మారి
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి
ఆ.. మెట్టినిల్లు వీడి చెల్లి..
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
బతుకమ్మ పండుగ వైభవం
పూవుల జాబిలివే పున్నమి వాకిలివే
ఆడపడుచులు నీ కన్న తల్లులయి
పున్నమి రాతిరిలో జోలలు పాడుదురే
ఆట కోయిలలే నీ అన్నదమ్ములయి
కంటికి రెప్పవలె నిన్ను కాపాడుదురే
ఏ తల్లి కడుపులోన నువ్వు పొందలేదే జన్మ
ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ
జన్మ జన్మాల బంధానివి నీవై..
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి
మంగ్లీ బతుకమ్మ పాట ప్రతి ఒక్కరి హృదయాల్ని ఆకట్టుకుంటూ, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటుతోంది. ఈ పాటతో మీ బతుకమ్మ సంబరాలను మరింత రంగులమయం చేసుకోండి.


