
ప్రముఖ గాయని మంగ్లీ బర్త్‌డే పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలతో తీవ్ర వివాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేయగా, బిగ్ బాస్ దివి కూడా ఈ వివాదంలో చిక్కుకుంది. ఆమె తన కెరీర్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
Key Points
మంగ్లీ బర్త్‌డే పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలు.
పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
బిగ్ బాస్ దివి పార్టీలో పాల్గొన్నట్లు వార్తలు, ఆమె వివరణ.
దివి తన కెరీర్‌కు హాని కలగకుండా ఉండాలని కోరుకుంటోంది.
మంగ్లీ బర్త్‌డే పార్టీలో వివాదం
ప్రముఖ గాయని మంగ్లీ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. మంగళవారం రాత్రి ఆమె బర్త్డే పార్టీ వేడుకలు చేవెళ్ల మండలంలో త్రిపుర రిసార్టులో జరిగాయి. మంగ్లీ బర్త్ డే పార్టీకి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, నటీనటులు హాజరైనట్లు తెలుస్తోంది. మంగ్లీ బర్త్ డే పార్టీలో మాదకద్రవ్యాలు, గంజాయి, విదేశీ మద్యం వాడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మంగ్లీ బర్త్ డే పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలు ఎవరు అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే పోలీసుల సమాచారం మేరకు బర్త్ డే పార్టీలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా కొందరికి గంజాయి పాజిటివ్, మరికొందరికి మాదకద్రవ్యాలు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.
పోలీసుల దర్యాప్తు మరియు కేసు నమోదు
అయితే మంగ్లీ బర్త్ డే పార్టీలో నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి పాల్గొన్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వివాదంలో దివి కూడా చిక్కుకున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో దివి స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది. దివి మాట్లాడుతూ.. మీడియా వారికి నా రిక్వెస్ట్.. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైనప్పుడు.. ఆ పార్టీలో జరిగే తప్పులన్నింటికీ మనమే ఎలా బాధ్యులమవుతాం ? అనేది ఒకసారి గమనించాలి.
ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి ఆహ్వానించారు కాబట్టి అందరిలాగే నేను కూడా వెళ్ళాను. కానీ ఆ పార్టీలో నిజంగా ఎవరు తప్పు చేశారు అనే నిజానిజాలు తెలుసుకోవాలి. అక్కడ జరిగిన తప్పులకు నేను ఎలా బాధ్యురాలిని అవుతాను. నేను నిజంగా తప్పు చేసి ఉంటే నా ఫోటో ఉపయోగించి వార్తలు వేయడం సమంజసం. కానీ నేను అక్కడ ఎలాంటి తప్పు చేయలేదు. అయినా కూడా నా ఫోటో వేస్తూ వార్తలు ప్రచారం చేస్తే నా కెరీర్ నాశనం అవుతుంది దయచేసి అలా చేయొద్దు.
దివి వివరణ మరియు ఆమె ఆందోళన
నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. దయచేసి ఆ వివాదానికి సంబంధించి నా ఫోటోలు ఉపయోగించొద్దు అని దివి పేర్కొంది.
మంగ్లీ బర్త్‌డే పార్టీ వివాదం తీవ్రంగా మారుతోంది. పోలీసుల దర్యాప్తుతో పాటు, దివి వంటి సెలబ్రిటీలపైనా ప్రభావం పడుతోంది. ఈ ఘటనతో తెలుగు సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.


