
📌 Key Points
- మంగ్లీ కేసులో పోలీసుల అత్యుత్సాహంపై హైకోర్టు సీరియస్.. ఏం జరగబోతోందో వేచి చూడాల్సిందే!
- అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన మంగ్లీ మైక్రో ఫైనాన్స్ స్కామ్!
- సుబ్బారావును బ్లాక్ మెయిల్ చేశారంటూ మంగ్లీ సంచలన ఆరోపణలు.. దుమారం రేపిన వివాదం!
- బాధితులతో కలిసి పీఎస్‌కు వెళ్లిన సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష.. పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం!
సింగర్ మంగ్లీ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణలతో ఆమె వార్తల్లో నిలిచారు. ఈ వివాదం వెనుక అసలు నిజాలు ఏమిటో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు.
మంగ్లీపై కేసు నమోదు చేసిన పోలీసులు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల తీవ్ర దుమారం రేపిన విషయం ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) మైక్రో ఫైనాన్స్ (Microfinance Scam) వ్యవహారం. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో మంగ్లీ పెద్ద ఎత్తున బాధితులను మోసం చేసిందని అడ్వకేట్ సుబ్బారావు (Advocate Subbarao) బాధితుల తరపున పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆ తర్వాత సుబ్బారావుపై మంగ్లీ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదం అయింది. అయితే ఈ అంశంలో తాజాగా హైకోర్టు ఇన్వాల్వ్ అయి పోలీసుల తీరును తప్పబడ్డటం బిగ్‍ట్విస్ట్ గా మారింది. దీంతో మంగ్లీ వివాదంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారా? ఈ కేసులో అసలేం జరుగుతోందనే చర్చ సోషల్ మీడియాలో గుప్పుమంటోంది.
సుబ్బారావుపై మంగ్లీ సంచలన ఆరోపణలు!
రోజుకో ట్విస్టుతో సాగుతున్న ఈ వివాదంలో మంగ్లీ వర్సెస్ సుబ్బారావు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం రచ్చగా మారింది. తొలుత అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ‘గోకుల నందన ఇన్‌ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో భారీ స్కామ్ జరిగిందని సుమారు 150 మంది బాధితుల నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేశారని, దీని వెనుక మంగ్లీ, ఆమె సోదరుడు ఉన్నారని సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మంగ్లీపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు అదే పంజాగుట్ట పీఎస్‍కు వెళ్లిన మంగ్లీ ఈ ఆరోపణలను ఖండించింది. సుబ్బారావుపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మంగ్లీ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. సుబ్బారావు తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని అందుకు తాను అంగీకరించకపోవడంతో తన పేరును బద్నాం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. మంగ్లీ చేసిన ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ మరుసటి రోజు బాధితులతో కలిసి పంజాగుట్ట పీఎస్‍కు వెళ్లిన అడ్వకేట్ సుబ్బారావుకు అక్కడ సీఐ, ఇతర అధికారులతో ఎదురైన అనుభవం ఈ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ గా మారింది.
పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్!
ఇందులో ఎవరి వాదన వాస్తవం అనేది ఇంకా తేలినప్పటికీ ఈ కేసులో తెలంగాణ పోలీసుల (TG Police) తీరు సైతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు పంజాగుట్ట పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించడం పట్ల తాజాగా హైకోర్టు సైతం సీరియస్ అయింది. అడ్వకేట్‍కు బ్రీత్ అనలైజర్ పరీక్షా? చట్టంలోని ఏ నిబంధన ప్రకారం ఆ పరీక్ష నిర్వహించారో చెప్పాలని పంజాగుట్ట పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు నోటీసులు ఇచ్చింది. చట్టపరిధిని అతిక్రమించి పిటిషనర్ వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛకు భంగం కలిగించరాదని స్పష్టం చేసింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీ తనకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సమయంలో సిటీ సీపీ సజ్జనార్ నవ్వుతూ కనిపించడం కూడా సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఆ తర్వాత అడిషనల్ డీజీ మహేష్ భగవత్‍ను కలిసి మంగ్లీ ఫిర్యాదు చేయడంపై నెటిజన్లు స్పందిస్తూ సెలబ్రిటీ కావడం వల్లే ఆమె పోలీసు ఉన్నతాధికారులను నేరుగా కలువగలుగుతున్నారా? అదే సామాన్యులకు ఇటువంటి వెసులుబాటు ఉంటుందా? అనే వాదన సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో మెరిట్స్ ఎలా ఉన్నా పోలీస్ శాఖ తీరు తీవ్ర అప్రతిష్ట పాలవుతోందని అందువల్ల ఇందులో నిజమైన దోషులను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మంగ్లీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. హైకోర్టు సీరియస్ కావడంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి.


