|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిత్రపరిశ్రమలో అలాంటి వారు ఉన్నందుకు సంతోషం: మణిరత్నం

Published: 03-06-2025, 1:11 AM
చిత్రపరిశ్రమలో అలాంటి వారు ఉన్నందుకు సంతోషం: మణిరత్నం

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె పని గంటలపై పెట్టిన షరతుల తరువాత, దర్శకుడు మణిరత్నం తన అభిప్రాయాలను వెల్లడించారు. నటీనటుల 8 గంటల పని సమయం డిమాండ్ సరైనదేనని ఆయన అన్నారు.

Key Points

1

మణిరత్నం 8 గంటల పని సమయం డిమాండ్‌ను సమర్థించారు.

2

దీపికా పదుకొణె పని గంటలు, రెమ్యునరేషన్ విషయంలో షరతులు పెట్టారని వార్తలు.

4

నటీనటుల పని గంటలపై చర్చ బాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.

మణిరత్నం వ్యాఖ్యలు

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె(Deepika padukone ) వర్కింగ్‌ అవర్స్‌ ఎక్కువగా ఉన్న కారణంగా ఒక భారీ ప్రాజెక్ట్‌ను వదులుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, పనిగంటలతో పాటు రెమ్యునరేషన్‌ వంటి అంశాలు కూడా కారణం అని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే టాపిక్‌ హిందీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌ అయిపోయింది. రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలి..? అనే అంశంలో సినిమా నటీనటులైనా ఇందుకు మినహాయింపు కాదని చర్చకు దారితీస్తుంది. ఈ విషయం గురించి ఇప్పటికే బాలీవుడ్‌ నటీనటులు ప్రత్యక్షంగా పరోక్షంగా పలు వేదికలపై మాట్లాడుతున్నారు. తాజాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం  (Mani Ratnam) కూడా  ఇదే అంశంపై పలు వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలోని నటీనటులు ఎవరైనా సరే 8 గంటలు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటామని డిమాండ్‌ చేయడంలో ఎలాంటి తప్పు లేదని మణిరత్నం అన్నారు. అలాంటి నిర్ణయం సరైనదేనని తాను భావిస్తన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. పనిగంటల విషయంలో అలా అడిగే నటీనటులు చిత్రపరిశ్రమలో ఉన్నందుకు తాను సంతోషిస్తున్నట్లు అన్నారు.  అలా అడగడంలో తప్పు లేదని ఒక దర్శకుడిగా చెబుతానని పేర్కొన్నారు.  ఈ విషయాన్ని అందరూ అంగీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  మణిరత్నం వ్యాఖ్యలు నటి దీపికా పదుకొణెకు మద్థతుగా ఉన్నాయిని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

దీపికా పదుకొణె షరతులు

బాలీవుడ్‌ నటి కాజోల్‌ తన భర్త అజయ్‌ దేవ్‌గణ్‌ కూడా పనిగంటల విషయంపై మాట్లాడారు. ‘మా’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌లో మొదట కాజోల్‌ మాట్లాడుతూ కొత్తగా తల్లి అయిన నటీమణుల వర్కింగ్‌ అవర్స్‌ గురించి చెప్పుకొచ్చారు. 8గంటలకు మించి వారు పనిచేయలేరని ఆమె అన్నారు. ఇంతలో అజయ్‌ దేవ్‌గణ్‌ కలుగచేసుకుని ఇలా రియాక్ట్‌ అయ్యారు. నిజాయతీ ఉన్న దర్శకనిర్మాతలు ఎవరూ కూడా వర్కింగ్‌ అవర్స్‌ విషయంలో వ్యతిరేకంగా ఉండరని పేర్కొన్నారు. 8 గంటల పాటు నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటే చాలని వారు అనుకుంటారని  ఆయన అభిప్రాయ పడ్డారు. దీంతో వారందరూ కూడా దీపికా పదుకొణెను ఉద్దేశించి ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడారని నెటిజన్లు అనుకున్నారు.

కాజోల్, అజయ్ దేవ్ గణ్ అభిప్రాయాలు

దీపికా పదుకొణె కండీషన్స్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాకు దీపికా పదుకొణె పెట్టిన కండీషన్స్‌ ఇవే అంటూ సోషల్‌ మీడియాలో కొన్ని వైరల్‌ అయ్యాయి. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో  ఆ ప్రాజెక్ట్‌ నుంచి ఆమె తప్పుకున్నట్లు సమాచారం. స్పిరిట్ సినిమా కోసం దీపికా పదుకునే మొదట రూ.20కోట్ల రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో షేర్‌ అడిగినట్లు సమాచారం. రెండోది కేవలం రోజుకు 8గంటలు మాత్రమే కేటాయిస్తానని దీపిక డిమాండ్‌. అయితే, ఉన్న 8 గంటల్లో అందులో 2 గంటలు జర్నీకే పోతుందని చర్చ. తెలుగు డైలాగ్స్‌ చెప్పలేనని పేర్కొన్న దీపిక. ఇలా పలు కండీషన్స్‌ ఉండటం వల్ల దీపికా పదుకొణెను సందీప్‌ వద్దనుకున్నట్లు తెలుస్తోంది.

చిత్ర పరిశ్రమలో నటీనటుల పని గంటలపై జరుగుతున్న చర్చ ముఖ్యమైనది. మణిరత్నం వంటి దర్శకుల మద్దతుతో, ఈ అంశంపై మరింత చర్చ జరగడం అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.