
📌 Key Points
- మణిపూర్‌లో రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి, తల్లికి తీవ్ర గాయాలు.
- బిష్ణుపూర్ జిల్లాలోని త్రోంగ్లాబీ గ్రామంలోని ఒక ఇంటిపై రాకెట్ పడింది.
- దాడి జరిగిన వెంటనే ప్రజలు ఆందోళనలు చేపట్టారు, ఆయిల్ ట్యాంకర్లు తగలబెట్టారు.
- లోయ ప్రాంతంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు.
మణిపూర్ రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో లోయ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మణిపూర్‌లో రాకెట్ దాడి: ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మణిపూర్ (Manipur) రాష్ట్రంలో మళ్లీ హింస మొదలైంది. బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలో జరిగిన రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో లోయ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇవాళ తెల్లవారుజామున మొయిరాంగ్ పరిధిలోని త్రోంగ్లాబీ అవాంగ్ లైకై గ్రామంలో ఒక పౌరుడి ఇంటిపై రాకెట్ వచ్చి పడింది. ప్రస్తుతం రాష్ట్రం బయట విధులు నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ (BSF) కానిస్టేబుల్ ఓయినం మాలెంన్గాన్బా (Oinam Malemnganba) నివాసమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న ఆయన ఐదేళ్ల కుమారుడు, ఐదు నెలల పసికందు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వారి తల్లి బినిత (37) ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
రాకెడ్ పడిన వార్త తెలియగానే బిష్ణుపూర్ జిల్లాలో ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చారు. నిరసనకారులు 2 ఆయిల్ ట్యాంకర్లు, ఒక ట్రక్కుకు నిప్పు పెట్టారు. మొయిరాంగ్ పోలీస్ స్టేషన్ (Moirang Police Station) ఎదుట భారీగా గుమిగూడి నిరసన తెలిపారు. పరిస్థితి విషమించకుండా ప్రభుత్వం వెంటనే లోయ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సరిహద్దు కొండ ప్రాంతాల నుంచి ఈ రాకెట్లను ప్రయోగించి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. నిందితుల కోసం కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే థొంగమ్ శాంతి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
ఆందోళనలతో అట్టుడుకుతున్న బిష్ణుపూర్
పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వ చర్యలు
మణిపూర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటోంది.


