|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mark Movie: 400 మందితో సాంగ్‌.. పెద్ద షిప్‌లో క్లైమాక్స్‌

Published: 14-11-2025, 10:20 PM
Mark Movie: 400 మందితో సాంగ్‌.. పెద్ద షిప్‌లో క్లైమాక్స్‌

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటిస్తున్న ‘మార్క్’ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. 200 అడుగుల భారీ షిప్ సెట్‌లో 400 మందితో పాట, క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Key Points

1

కిచ్చా సుదీప్‌ నటించిన 'మార్క్' సినిమా షూటింగ్ పూర్తయింది.

2

200 అడుగుల భారీ షిప్ సెట్‌లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించారు.

4

డిసెంబర్ 25న కన్నడ, తెలుగు సహా పలు భాషల్లో సినిమా విడుదల కానుంది.

‘మార్క్’ షూటింగ్ పూర్తి, భారీ క్లైమాక్స్

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ కు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి పేరుంది. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం మార్క్‌. భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇటీవల ఈ చిత్ర క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. అందుకోసం 200 అడుగుల పొడవైన షిప్‌ సెట్‌ వేసినట్లు చెప్పారు.

400 మందితో పాట ఈ సెట్‌లో చిత్రీకరించిన పాటలో 100 మందికి పైగా నటీనటులు, 300 మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారని చెప్పారు. ప్రేక్షకుల అంచనాలను మించే విధంగా మార్క్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ముఖ్య పాత్రల్లో నటుడు నవీన్‌ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్‌ తదితరులు నటించినట్లు చెప్పారు.

400 మందితో సాంగ్, షిప్ సెట్ వివరాలు

రిలీజ్‌ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 25న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూవీకి అజనీశ్‌ లోకనాథ్‌ సంతం అందిస్తున్నారు. కిచ్చా సుదీప్‌ చిత్రం అంటే కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో మార్క్‌ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి.

రిలీజ్ డేట్, అంచనాలు

‘మార్క్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 200 అడుగుల షిప్‌లో 400 మందితో తీసిన సాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. డిసెంబర్ 25న ఈ భారీ చిత్రాన్ని వీక్షించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.