|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ఈసారి పండక్కి సౌండ్ మామూలుగా ఉండదు’.. మాస్ జాతర రిలీజ్ డేట్‌తో పాటు అదిరిపోయే పోస్టర్ రిలీజ్

Published: 29-05-2025, 5:00 AM

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. శ్రీ లీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ ఆగస్టు 27న విడుదల

2

శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలను ఏర్పరుస్తుంది

4

‘ఈసారి పండక్కి సౌండ్ మామూలుగా ఉండదు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ విడుదల

మాస్ జాతర రిలీజ్ డేట్ ఖరారు

మాస్ మహారాజ రవితేజ(Ravi Teja) హీరోగా శ్రీ లీల(Sreelela) హీరోయిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(Mass Jathara). ఇక దీన్ని దర్శకుడు భాను బోగవరపు(Bhanu Bhogavarapu) తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ అవైటెడ్ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటూ పోయింది. అయితే ఈ చిత్రం ఈపాటికే విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల చేత ఆలస్యం అయ్యింది.

దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కి తెర పడింది. ఇందులో భాగంగా మాస్ జాతర చిత్రాన్ని ఆగస్టు 27న గ్రాండ్‌లో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు మూవీటీమ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ.. ‘ఇది ఈ పండుగ సీజన్ యొక్క అధికారిక ప్రకటన. మాస్ మహారాజ్ రవితేజ ఈ గణేష్ చతుర్థి – ఆగస్టు 27న పూర్తి స్థాయిలో క్రాకర్‌ని తీసుకువస్తున్నాము.. ఈసారి పండక్కి సౌండ్ మామూలుగా ఉండదు’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

అదిరిపోయే పోస్టర్ రిలీజ్

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

రవితేజ అభిమానులకు గణేష్ చతుర్థి పండుగ రోజున ‘మాస్ జాతర’ చిత్రం విడుదల అవుతుంది. ఈ సినిమా విడుదలతో సినీ ప్రేక్షకులకు పండగ వేళ మంచి వినోదం లభించనుంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.