
📌 Key Points
- చిరు 158లో ప్రియమణి హీరోయిన్‌గా ఫిక్స్! మెగా ఫ్యాన్స్‌కు పండగే!
- యంగ్ బ్యూటీ కృతి శెట్టి చిరుకి కూతురిగా నటించనుందట!
- ఫిబ్రవరి నుండి మెగా-158 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం!
- విశ్వంభర మూవీతో పాటు మెగా-158లో చిరు డబుల్ ట్రీట్!
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మెగా 158 సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది.
మెగా-158లో హీరోయిన్ ఫిక్స్ అయిందా?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Varaprasad Garu) సినిమా ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతూ మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. అయితే చిరు ప్రజెంట్ ‘విశ్వంభర’(Viswambhara) మూవీతో పాటు స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లితో ‘మెగా-158’(Mega-158) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కథలో కీలక పాత్ర పోషించనున్నాయట.
మెగాస్టార్‌ను కొత్త కోణంలో ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు బాబీ ప్రత్యేకంగా ఈ కథను రూపొందించాట. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ కానుందట. ఈ క్రమంలో హీరోయిన్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో చిరుకు హీరోయిన్‌గా అలనాటి స్టార్ బ్యూటీ ప్రియమణి(Priyamani) నటిస్తుందట. అంతేకాకుండా చిరుకు కూతురిగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) నటించనున్నదట. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
చిరు కూతురిగా కృతి శెట్టి.. నిజమెంత?
ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్!
మెగా 158 గురించి వస్తున్న ఈ వార్తలు మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


