|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా 158: ముహూర్తం డేట్ ఫిక్స్! గ్యాంగ్‌స్టర్‌గా చిరు..షూటింగ్ ఎప్పుడంటే?

Published: 02-04-2026, 11:05 AM
మెగా 158: ముహూర్తం డేట్ ఫిక్స్! గ్యాంగ్‌స్టర్‌గా చిరు..షూటింగ్ ఎప్పుడంటే?
  • చిరంజీవి 158వ సినిమా బాబీ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్‌పై రూపొందనుంది.
  • ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలు, ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.
  • ఈ సినిమాలో చిరంజీవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు, కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో చిత్రం నడుస్తుంది.
  • విశ్వంభర సినిమా విఎఫ్ఎక్స్ పనుల కారణంగా విడుదల ఆలస్యం.

మెగాస్టార్ చిరంజీవి తన 158వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుంది.

మెగా 158 ముహూర్తం ఎప్పుడు?

Mega 158 Film: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సుమారు 350 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ఎంతో మంచి విషయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిరంజీవి తదుపరి సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈయన తన 158వ సినిమాని బాబి డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని అధికారకంగా ప్రకటించారు. కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా గత ఏడాదే షూటింగ్ పనులను ప్రారంభించుకోవాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నెలలో ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీ ఎంతో ఘనంగా పూజ కార్యక్రమాలను జరుపుకోబోతున్నారు. అలాగే ఏప్రిల్ 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

గ్యాంగ్‌స్టర్‌గా చిరంజీవి లుక్ ఎలా ఉండబోతుంది?

ఇలా ఈ సినిమా పూజా కార్యక్రమాలు రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ రావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ విషయానికి సంబంధించి కెవిఎన్ ప్రొడక్షన్స్ అధికారకంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, ఇందులో చిరంజీవి గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ లాల్ కూడా బాగమవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి జోడిగా సీనియర్ నటి ప్రియమణి హీరోయిన్గా నటించగా వీరి కూతురు పాత్రలో అనస్వర రాజన్ నటించబోతున్నట్టు సమాచారం.

విడుదలకు సిద్ధంగా విశ్వంభర…

విశ్వంభర విడుదల ఎప్పుడు?

ఇలా ఈ సినిమాకు సంబంధించి ఈ వార్తల పట్ల ఇప్పటివరకు చిత్ర బృందం ఎక్కడ అధికారకంగా ప్రకటించలేదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ఇప్పటికే డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో నటించిన విశ్వంభర సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ పనులు కారణంగా ఈ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. మంచి క్వాలిటీతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే సినిమాని ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవికి జోడిగా ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

చిరంజీవి వరుస సినిమాలతో అభిమానులకు వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నారు. మెగా 158 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.