|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా హీరోల వెరైటీ మీటింగ్.. గుర్తు పట్టలేని విధంగా రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్

Published: 10-08-2025, 5:47 AM
మెగా హీరోల వెరైటీ మీటింగ్.. గుర్తు పట్టలేని విధంగా రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్

మెగా కుటుంబ హీరోలు రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ ఆదివారం జిమ్ లో కలిసి వర్కౌట్ చేశారు. రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం లుక్ మార్చుకోవడంతో, అతని మార్పు అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Key Points

1

మెగా హీరోలు రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ జిమ్ లో కలిసి వర్కౌట్ చేశారు.

2

రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం కోసం లుక్ మార్చుకున్నారు, గుర్తుపట్టడం కష్టం అంటున్నారు అభిమానులు.

4

మెగా హీరోల ఫిట్‌నెస్ ప్రేరణగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

జిమ్ లో మెగా హీరోల సమావేశం

మెగా కుటుంబంలోని హీరోల మధ్య ఉన్న బంధం ఎప్పుడూ ప్రత్యేకమే. సందర్భం వచ్చినప్పుడల్లా మెగా హీరోలు ఫ్యామిలీ మొత్తం మీట్ అవుతారు. ఆ క్షణాలని మెమొరబుల్ గా మార్చుకుంటారు. ఈసారి మెగా హీరోల మీటింగ్ చాలా వెరైటీగా జరిగింది. ఆదివారం రోజు మెగా హీరోలు రాంచరణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ జిమ్ లో కలుసుకున్నారు.

సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ ఈ ఫోటోని తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఆ ఫోటోలో రామ్ చరణ్ బలమైన శరీర నిర్మాణంతో, బాగా పెరిగిన గడ్డంతో, స్ట్రాంగ్  బైసెప్స్‌తో కనిపిస్తున్నారు. రాంచరణ్ ని సడెన్ గా చూస్తే గుర్తు పట్టడం కష్టం. అంతలా చరణ్ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ ఉంది.చరణ్ తో పాటు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్ కూడా వర్కౌట్‌లో పాల్గొన్నారు. సాయి దుర్గ తేజ్ కూడా గుర్తు పట్టలేని విధంగా మారిపోయాడు. ఆదివారం విశ్రాంతి తీసుకోకుండా, ఫిట్‌గా ఉండేందుకు ముగ్గురు హీరోలు జిమ్‌కి హాజరైన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ షర్ట్‌లెస్ లుక్ చూడాలనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఈ చిత్రం బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతోంది.ఈ మూవీలో రామ్ చరణ్ మేకోవర్ అంచనాలు పెంచేస్తోంది.

రామ్ చరణ్ లుక్ ట్రాన్స్ఫర్మేషన్

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు సాయి ధర్మ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రంలో నటిస్తున్నారు. ముగ్గురూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ఎప్పుడూ సమయం కేటాయిస్తారు.

ఫిట్‌నెస్‌పై మెగా హీరోల దృష్టి

రామ్ చరణ్ పెద్ది చిత్రం కోసమే ఇలా తన మేకోవర్ మార్చుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడంతో మెగా అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు పెద్ది చిత్రంపైనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.

A post shared by Sai DURGHA Tej (@jetpanja)

మెగా హీరోల ఫిట్‌నెస్‌పై ఉన్న శ్రద్ధ మరియు వారి బంధం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారి సినిమాల విజయం కోసం అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.