|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ సంచలన నిర్ణయం! రిటైర్మెంట్ తర్వాత చిరు ఎక్కడ ఉండబోతున్నారో తెలిస్తే షాక్!

Published: 16-02-2026, 9:35 PM
మెగాస్టార్ సంచలన నిర్ణయం! రిటైర్మెంట్ తర్వాత చిరు ఎక్కడ ఉండబోతున్నారో తెలిస్తే షాక్!
  • 70 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న చిరంజీవి ఫిట్‌నెస్.
  • వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి, ఫుల్ ఫామ్ లో ఉన్నారు.
  • విశాఖపట్నం అంటే చిరంజీవికి ఎంతో ఇష్టం, స్వయంగా వెల్లడించిన మెగాస్టార్.
  • విశాఖలో ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ షూటింగ్ జరిగాయని గుర్తు చేసుకున్న చిరు.

మెగాస్టార్ చిరంజీవి రిటైర్మెంట్ గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది! ఆయన ఎక్కడ స్థిరపడాలని అనుకుంటున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు! ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

చిరంజీవి ఫిట్‌నెస్ సీక్రెట్స్!

మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కుర్ర హీరోలు కూడా కుళ్లుకునే విధంగా సినిమాలు చేస్తూ.. ఫిట్ లో పోటీపడుతూ.. దూసుకుపోతున్నారు. ఈ ఏజ్ లో చాలామంది స్టార్స్ హీరోలుగాద రిటైర్ అయినవారు ఉన్నారు. లేదా క్యారెక్టర్ రోల్స్ చేసుకునేవాళ్లు ఉన్నారు. కానీ ఇప్పటికీ తన హీరో ఇమేజ్ ను అలాగే కాపాడుకుంటూ… దూసుకుపోతున్నారు చిరు. ఫిట్ నెస్ కోసం డైట్ ఫాలో అవుతూ.. ప్రత్యేకమైన వర్కౌట్స్ తో స్లిమ్ గా మెయింటేన్ చేస్తున్నారు చిరంజీవి.

ఇక గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్ చూసిన చిరంజీవికి.. ఈ ఏడాది శుభారంభం దక్కింది. మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్. ఈ సినిమాలో చిరంజీవినిచాలా కొత్తగా చూపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

కంప్లీట్ గా వెయిట్ తగ్గిపోయి, ఫిట్ గా.. యంగ్ లుక్ లో ఉన్న చిరంజీవిని అభిమానులకు చూపించాడు అనిల్. అంతే కాదు అప్పటి ఎనర్జీని మళ్లీ తిరిగి తీసుకొచ్చాడు. ఈసినిమాలో చిరంజీవి పెర్ఫామెన్స్ కూడా మామూలుగా లేదు. కామెడీ టైమింగ్, యాక్షన్, ఎమోషన్ తో అదరగొట్టాడు మోగాస్టార్. అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమాను అందించాడు.

విశాఖతో మెగాస్టార్ అనుబంధం

చిరంజీవి ఈ ఏజ్ లో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పట్లో ఆయన రిటైర్ అయ్యే అవకాశం లేదు. కానీ ఒక వేళ.. ముందు ముందు రిటైర్మెంట్ ఆలోచన వచ్చినా..హ్యాపీగా లైఫ్ ను పీస్ ఫుల్ గా గడపాలి అనుకుంటే చిరంజీవి ఎక్కుడ ఉండాలనుకుంటున్నారో తెలుసా? ఆయనకు బాగా ఇష్టమైన ప్రదేశం ఏది? ప్రశాంతంగా అక్కడ ఒక ఇల్లు కట్టుకుని , నేచర్ ను ఆస్వాదిస్తూ.. హ్యాపీగా గడిపేయాలి అని స్టార్ సీనియర్ హీరో అనుకుంటున్నారని తెలుసా? ఇంతకీ ఆ ఊరు ఏదో కాదు విశాఖ పట్నం. అవును ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ” విశాఖ పట్నం అందమైన తీర ప్రాంతం చూస్తుంటే.. సాగర తీరాన అంటూ ఛాలెంజ్ లో సాంగ్ గుర్తుకు వస్తుంది. యూరేకా సాకా మికా అంటూ అభిలాషలో సాంగ్, ఘరానా మొడులు సినిమాలో బంగారు కోడి పెట్ట సాంగ్ కూడా గుర్తుకు వస్తుంది.. ఇలా ఆ టైమ్ లో ఇక్కడ షూట్ చేసిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

ఆ టైమ్ లో 80 దశకంలో.. హీరో అవ్వాలి, పెద్ద స్టార్ అవ్వాలి అని ఎంతో ఉత్సాహంగా ఈ రిషి కొండ నుంచి.. ఆర్కే బీచ్, గంగవరం పోర్ట్ వరకూ చాలా సినిమాల షూటింగ్స్ ఇక్కడ జరిగాయి. ఆరకంగా విశాఖ పట్నంతో ఎంతో అనుబందం ఉంది. ” అని చిరంజీవి అన్నారు.

రిటైర్మెంట్ తర్వాత చిరు ప్లాన్స్!

మెగాస్టార్ చిరంజీవి రిటైర్మెంట్ అంటూ ఉంటే వైజాగ్ లో ఉండాలనే కోరికను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..” విశాఖపట్నం అందమైన తీరం ఉన్న ప్రాంతమే కాదు.. అందమైన మనసున్న మనుషులు ఉన్న ఊరు. ఇక్కడి వారు చాలా చాలా ప్రేమ చూపిస్తుంటారు.

ఇక్కడి మనుషులు శాంతి కాముకులు, అందుకే ఎన్నో సార్లు అన్నాను.. మళ్లీ మళ్లీ అంటున్నాను…సెకండ్ హోప్ ఉంటే.. రిటైర్మెంట్ అయిన తరువాత ప్రశాంతంగా ఉండాలి అంటే.. అది విశాఖ పట్నంలోనే అని తెలియజేసుకుంటున్నాను. ” అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గతంలో చిరంజీవి మాట్లాడిన ఈ మాటలు ఈమధ్య మరోసారి వైరల్ అవుతున్నాయి.

చిరంజీవిగారి రిటైర్మెంట్ ప్రణాళికల గురించి ఈ వార్త ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.