|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌కు మెగాస్టార్ ఫిదా! మాస్ ట్రీట్ అంటోన్న ఫ్యాన్స్!

Published: 15-03-2026, 10:35 AM
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌కు మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ టాక్!
  • రామ్ చరణ్ కూడా ఫిదా! హరీష్ శంకర్ టేకింగ్‌కి మరోసారి జై కొట్టిన మెగా ఫ్యాన్స్.
  • దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా భారీ అంచనాలతో విడుదలకి సిద్ధం.
  • మార్చి 19న గ్రాండ్ రిలీజ్! పవన్ కళ్యాణ్ మాస్ అవతార్‌లో అదరగొట్టేందుకు రెడీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ విడుదలైంది! మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ నుండి ఈ ట్రైలర్‌కు భారీ ప్రశంసలు లభించాయి. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి ఏమన్నారంటే…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉండడంతో దీనికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ట్రైలర్‌పై చిరంజీవి, రామ్ చరణ్ తమదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

రామ్ చరణ్ రియాక్షన్ వైరల్!

చిరంజీవి “ట్రైలర్ తో మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో అన్నీ శుభాలే!!” అంటూ ఓ పోస్ట్ చేశాడు. ఇక రామ్ చరణ్ “ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్వాగ్ తో ఫెంటాస్టిక్ గా ఉన్నారు. పవన్ గారిని ఎలా చూపించాలో హరీష్ శంకర్ కి బాగా తెలుసు” అంటూ పోస్ట్ చేసాడు. ఇప్పటికే చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ మూవీ మంచి విజయం సాధించడంతో మెగా ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు.

మార్చి 19న థియేటర్లలో రచ్చ!

మరికొన్ని రోజుల్లో విడుదల కాబోయే పవన్ సినిమా గురించి ఇద్దరు హీరోలు పాజిటివ్గా స్పందించడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. మార్చి 19వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే పవన్, హరీష్ కాంబోలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

మెగాస్టార్ మరియు రామ్ చరణ్ ఇద్దరూ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.