
వణికించే సన్నివేశాలు, భయపెట్టే కథాంశం, అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్‌తో ‘జారన్’ అనే హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరాఠీలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
Key Points
మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్ ట్విస్ట్‌తో 'జారన్' థ్రిల్లర్.
ఓటీటీలో ఆగస్టు 8 నుండి జీ5లో స్ట్రీమింగ్.
మరాఠీ హారర్ థ్రిల్లర్‌గా థియేటర్లలో సూపర్ హిట్.
అమృత సుభాష్, అనిత, కిశోర్ నటన అదిరిపోయింది.
జారన్: ఓటీటీ రిలీజ్ వివరాలు
వణికించే సీన్లు, భయపెట్టే స్టోరీ లైన్, అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్ తో ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు హారర్ థ్రిల్లర్ ‘జారన్’ (Jarann) మూవీ వచ్చేస్తోంది. థియేటర్లలో అదరగొట్టి మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకున్న ఈ మరాఠీ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ను భయపెట్టేందుకు ఓటీటీలో అడుగుపెట్టనుంది.
మరాఠీ హారర్ థ్రిల్లర్ జారన్ ఓటీటీ లోకి రాబోతుంది. జీ5 లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 8 నుంచి ఈ మూవీని ఓటీటీలో చూడొచ్చు. ప్రస్తుతానికైతే మరాఠీ భాషలోనే అందుబాటులోకిి తీసుకు రానున్నారు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. జీ5 ఓటీటీలో ఉన్న ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే వణుకు పుడుతోంది. హారర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కు ఈ మూవీ మరో లెవల్ ఎక్స్ పీరియన్స్ అందించే అవకాశం ఉంది.
కథాంశం మరియు నటీనటులు
జారన్ సినిమా జూన్ 6, 2025న థియేటర్లలో రిలీజైంది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది ఈ హారర్ థ్రిల్లర్ . ట్విస్ట్ లతో ఆడియన్స్ కు మంచి థ్రిల్ పంచింది. అందుకే ఈ హారర్ మూవీని తప్పకుండా చూడాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ఈ సినిమాకు హృషికేష్ గుప్తే డైరెక్టర్. కథ కూడా అతనే రాశాడు. అమృత సుభాష్, అనిత, కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా అమృత సుభాష్, అనిత యాక్టింగ్ అయితే అదిరిపోయింది.
ఈ సినిమాను అమోల్ భగత్, నితిన్ బాల్ చంద్ర నిర్మించారు. బ్లాక్ మ్యాజిక్, ప్రేతాత్మలు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది. 124 నిమిషాల రన్నింగ్ టైమ్ ఉన్న ఈ సినిమా ప్రతి సీన్ కూడా థ్రిల్ కలిగిస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
సినిమా ప్రత్యేకతలు
ఓ మారుమూల గ్రామంలోని ఇంట్లో జరిగే సూపర్ నేచురల్ సంఘటనలతో జారన్ సినిమాను రూపొందించారు. సైకలాజికల్, బ్లాక్ మ్యాజిక్, మూఢ నమ్మకాలు, పురాతన సంప్రదాయాలు పాటించే ఓ కుటుంబంలో ఏం జరిగిందన్నదే కథ. ఓ ఇంట్లో ఆనందంగా భర్త, పాపతో కలిసి ఓ మహిళ నివసిస్తుంది. కానీ ఆమె జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆమె భర్త ప్రమాదంలో చనిపోతాడు. గతం తాలూకు ఓ శాపం ఆమెను వెంటాడుతుంది.
మరి ఆ శాపం నుంచి ఆమె తప్పించుకుందా? బ్లాక్ మ్యాజిక్ ఎవరు? ఎందుకు చేస్తున్నారు? చివరకు ఏం జరిగిందన్నదే జారన్ కథ.
జారన్ సినిమా భయానక సన్నివేశాలు, ట్విస్ట్ కథాంశంతో ప్రేక్షకులను అలరిస్తుంది. జీ5లో దీన్ని తప్పకుండా చూడండి.


