|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mirai Movie: బాక్సాఫీస్‌ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతంటే?

Published: 13-09-2025, 2:15 AM

తేజ సజ్జ నటించిన ‘మిరాయ్’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తొలిరోజు వసూళ్లతో సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. హనుమాన్ సినిమా రికార్డును కూడా దాటింది.

Key Points

1

మిరాయ్ సినిమా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.12 కోట్లకు పైగా వసూలు చేసింది.

2

రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం హనుమాన్ సినిమా కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది.

3

తేజ సజ్జ, రితికా నాయక్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

4

నార్త్ అమెరికాలో 7 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది.

మిరాయ్ సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్లు

ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో గ్రాఫిక్స్‌ ఉపయోగిస్తున్నారు. ఈ వీఎఫ్‌ఎక్స్‌ కోసం వందల కోట్లు గుమ్మరించేస్తున్నారు. దాంతో బడ్జెట్‌ తడిసిమోపెడవుతోంది. దానికి తగ్గట్లుగా కలెక్షన్స్‌ రాబట్టడం గగనమవుతోంది. కానీ మిరాయ్‌ ( Mirai Movie ) మాత్రం తక్కువ బడ్జెట్‌తోనే అద్భుతాలు సృష్టించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ మిరాయ్‌. హీరోయిన్‌గా రితికా నాయక్‌, విలన్‌గా మంచు మనోజ్‌, హీరో తల్లిగా శ్రియ నటించారు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.

తక్కువ బడ్జెట్ తో భారీ విజయం

ఫస్ట్‌డే కలెక్షన్స్‌ సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. తొలిరోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.12 కోట్లకుపైగా నెట్‌ కలెక్షన్స్‌ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది హనుమాన్‌ కంటే కూడా ఎక్కువని తెలుస్తోంది! తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్‌ మూవీ మొదటిరోజు దేశవ్యాప్తంగా దాదాపు రూ. 10 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టింది. ఈ రికార్డును మిరాయ్‌ బద్ధలు కొట్టింది. మిరాయ్‌.. నార్త్‌ అమెరికాలో 7 లక్షల డాలర్లు (రూ.6 కోట్లపైనే) వసూలు చేసినట్లు చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. వీకెండ్‌లో ఈ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

తేజ సజ్జ కెరీర్ లో మరో మైలురాయి

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మిరాయ్’ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది. తొలిరోజు వసూళ్లు అంచనాలను దాటడంతో చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.