
📌 Key Points
- కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో భయం పుట్టిస్తోందని మోడీ విమర్శించారు.
- కాంగ్రెస్ ఓటముల సెంచరీకి చేరువలో ఉందని మోడీ జోస్యం చెప్పారు.
- యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనను మోడీ తప్పుబట్టారు.
- అస్సాం అభివృద్ధికి కాంగ్రెస్ ఏమీ చేయలేదని మోడీ ఆరోపించారు.
అస్సాంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో భయాన్ని సృష్టిస్తోందని, త్వరలోనే ఓటముల సెంచరీ పూర్తి చేసుకోబోతోందని ఆయన అన్నారు.
కాంగ్రెస్‌పై మోడీ విమర్శలు
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రజల్లో భయం పుట్టిస్తూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు. శనివారం అస్సాంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతున్నారు. కాంగ్రెస్ ఓటముల సెంచరీకి చేరువలో ఉందని.. ఆ పార్టీ త్వరలోనే ఓటముల సెంచరీ పూర్తి చేసుకోబోతోందని జోస్యం చెప్పారు. గత నెలలో జరిగిన ఏఐ (AI) సమ్మిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అర్ధనగ్న ప్రదర్శనను ప్రధాని ఈ సందర్భంగా తప్పుబట్టారు. దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ వింత నిరసనలకు దిగుతోంది. ఏఐ సమ్మిట్‌ను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నంలో భాగంగా బహిరంగంగా తమ బట్టలు తామే చింపుకున్నారు. ఓటమి భయంతో, తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్‌కు ఇప్పుడు బట్టలు చింపుకోవడం తప్ప వేరే పని మిగిలినట్టు లేదు అంటూ ఎద్దేవా చేశారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అస్సాం యువతను హింస, ఉగ్రవాదం అనే విషవలయంలోకి నెట్టాయని మోడీ ఆరోపించారు. అసోంను కాంగ్రెస్ తన ‘డివైడ్ అండ్ రూల్’ పాలసీకి ప్రయోగశాలగా మార్చుకుందని దుయ్యబట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన స్రవంతికి దూరం చేశారని, బరాక్ వ్యాలీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.సుమారు రూ. 24,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు విలువ రూ. 24,000 కోట్లు. కాంగ్రెస్ నాయకులకు ఒక పెన్ను, కాగితం ఇచ్చి ఈ అంకెను రాయమంటే.. వారు కనీసం దాన్ని సరిగ్గా రాయలేరు కూడా అని చమత్కరించారు. కాంగ్రెస్ ఆలోచన ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ బీజేపీ పని మొదలవుతుందని చెప్పారు.
ఓటముల సెంచరీకి చేరువలో కాంగ్రెస్
అస్సాం అభివృద్ధిపై మోడీ వ్యాఖ్యలు
ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఈ విమర్శలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి.


