|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోడీ పొదుపు మంత్రం.. బీజేపీ నేత 50 కార్ల కాన్వాయ్: నెటిజన్ల ఆగ్రహం!

Published: 12-05-2026, 5:00 PM
మోడీ పొదుపు మంత్రం.. బీజేపీ నేత 50 కార్ల కాన్వాయ్: నెటిజన్ల ఆగ్రహం!
  • ప్రధాని మోడీ ఇంధన వినియోగం తగ్గించాలని పిలుపునిచ్చారు.
  • మరుసటి రోజే బీజేపీ నేత సౌభాగ్య సింగ్ ఠాకూర్ 50 కార్ల కాన్వాయ్‌తో ర్యాలీ.
  • కొత్త పదవి స్వీకరణకు ఉజ్జయిని నుండి భోపాల్ వరకు భారీ కాన్వాయ్.
  • మోడీ మాటలను విస్మరించినందుకు నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు.

ప్రధాని మోడీ ఇంధన పొదుపు, ప్రజా రవాణా వాడకంపై ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ఆయన సందేశం ఇచ్చిన మరుసటి రోజే, ఒక బీజేపీ నేత 50 కార్ల భారీ కాన్వాయ్‌తో ర్యాలీ తీయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

మోడీ ఇంధన పొదుపు సందేశం

హైద‌రాబాద్ లో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని మోడీ బంగారం కొన‌డం త‌గ్గించాల‌ని, ఇంధ‌నాల వినియోగం త‌గ్గించాల‌ని చెప్పిన సంగతి తెలిసిందే. అన‌వ‌స‌ర ఇంధ‌న‌వాడకం త‌గ్గించుకుని ప్ర‌జార‌వాణా, మెట్రో సేవ‌ల‌ను ఉపయోగంచుకోవాల‌ని సూచించారు. అంతే కాకుండా ఎల‌క్ట్రిక్ వాహానాల వినియోగం పెంచాల‌న్నారు. కరోనా సమ‌యంలో అవ‌లంబించిన కొన్ని ప‌ద్ద‌తులు పాటించాల‌న్నారు. అయితే ఇది జ‌రిగిన మ‌రుస‌టి రోజే ఓ బీజేపీ నేత 50 ఎస్ యూవీ కార్ల‌తో భారీ ర్యాలీ తీసి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకుడు, గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ సౌభాగ్య సింగ్ ఠాకూర్ కొత్త‌గా చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్క‌డంతో భారీ ర్యాలీ తీశాడు. కొత్త ప‌ద‌విని స్వీక‌రించ‌డానికి ఉజ్జ‌యిని నుండి భోపాల్ వ‌ర‌కు ఇలా కాన్వాయ్ తో వెళ్లాడు. అలా వెళుతున్న స‌మ‌యంలో ఆయ‌న అనుచ‌రులు హంగామా చేస్తూ క‌నిపించారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీంతో ఆ నేత‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. మీ పార్టీ పెద్ద చెప్పిన మాట నువ్వు విన‌కుంటే ఇంకా ఎవ‌రు వింటార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

బీజేపీ నేత భారీ కాన్వాయ్ వివాదం

నెటిజన్ల ఆగ్రహం, రాజకీయ విమర్శలు

మోడీ ఇంధన పొదుపు సందేశాన్ని బీజేపీ నేత విస్మరించడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాయకులు ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ఈ వివాదంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.